Rashmika Mandanna : ఆపదలో రష్మిక మందన్నా.. ఆదుకోవాలంటూ లేఖలు

Rashmika Mandanna :  ఆపదలో రష్మిక మందన్నా.. ఆదుకోవాలంటూ లేఖలు
X

నేషనల్ క్రష్ గా తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. అయితే అమ్మడు అనుకోకుండా చేసే కొన్ని వ్యాఖ్యలు అప్పుడప్పుడూ వివాదాలు రేకెత్తిస్తుంటాయి. తను కన్నడ అమ్మాయిని కాదు అన్నట్టుగా కొన్నాళ్లుగా ప్రవర్తిస్తోంది రష్మిక. ఆ మధ్య తను ఇంకా కాంతార సినిమా చూడలేదు అన్నప్పుడు కన్నడిగులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రీసెంట్ గా ఛావా ప్రమోషనల్ ఈవెంట్స్ లో తను హైదరాబాద్ అమ్మాయిని అని చెప్పింది. దీంతో కన్నడిగులంతా భగ్గుమన్నారు. రష్మికకు గట్టి బుద్ధి చెబుతాం అంటూ రాజకీయ నాయకులు కూడా బాహాటంగా విమర్శలు చేస్తూ బెదిరింపులకు దిగారు.

సోషల్ మీడియాలో ఈ గొడవ రాన్రానూ మరింత ముదురుతోంది. దీంతో రష్మికకు ఆమె సొంత కులానికి చెందిన కొడవ వంశస్తుల నుంచి మద్ధతు లభిస్తోంది. ఆమె సామాజిక వర్గం ఆ ప్రాంతంలో బలంగా ఉండటం, వారంతా ఆమెకు మద్ధతుగా నిలవడంతో రష్మిక వ్యవహారం రాజకీయంగానూ మలుపులు తిరుగుతోంది. మరోవైపు కొడవ సామాజిక వర్గం వాళ్లంతా రష్మిక ప్రాణాలకు ముప్పు ఉందని.. ఆమెకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం కన్నడలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి తనకు టాలీవుడ్ నుంచి ఎక్కువ పాపులారిటీ వచ్చింది కాబట్టి అలా హైదరాబాద్ కు చెందిన దానను అని చెప్పిందేమో రష్మిక. ఈ మాత్రం దానికి తను నిజంగానే హైదరాబాదీ అయిపోతుందా.. ? ఒకవేళ అయిపోతే మాత్రం కర్ణాటక రాష్ట్రానికి వచ్చి నష్టం ఏంటీ..? అంటూ ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అందుకే అంటారు వేదికలపై కాస్త ఆచితూచి మాట్లాడాలి అని. తను ఏ కారణంతో అన్నదో కానీ అదంతా ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుని రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేసింది.

Tags

Next Story