Rashmika Mandanna : ఎక్స్ లవ్ పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Rashmika Mandanna :   ఎక్స్ లవ్ పై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
X
Rashmika Mandanna : ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న కర్ణాటక క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా అడుగుపెట్టింది..

Rashmika Mandanna : ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న కర్ణాటక క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా అడుగుపెట్టింది.. గురువారం యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. మొదటి వీడియోలో రష్మిక తనకు నటన అంటే ఎందుకు ఇష్టం, ట్రావెలింగ్ అంటే ఎందుకు ఇష్టం, డ్యాన్స్ అంటే ఎందుకు ఇష్టం అంటూ తన గురించి ఇలా పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

అందులో భాగంగానే తన ఎక్స్ లవ్ గురించి ప్రశ్న ఎదురవ్వగా రష్మిక దానిపైన స్పందించింది. ప్రేమను వర్ణించడం కష్టం ఎందుకంటే ఇది భావాలకు సంబంధించినది. ప్రేమ రెండు వైపులా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది, ఒక్కటే కాదు అంటూ చెప్పుకొచ్చింది. సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న రష్మిక.. గతేడాది పుష్ప మూవీతో ఆకట్టుకోగా, ఈ నెల(మార్చి) 4న విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లులో శర్వానంద్‌తో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకుంది. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2లో బిజీగా ఉంది.

Tags

Next Story