నువ్వేంటో నాకు తెలుసు.. లైట్ తీసుకో: ఐశ్వర్యకు రష్మిక ట్వీట్
వివాదాలకు దూరంగా ఉందామంటే అస్సలు సాధ్యం కాదు.. ఏం మాట్లాడినా తప్పు పడుతుంటారు.. తన ఉద్దేశం అది కాదన్నా వినిపించుకోరు. వాళ్లు వాళ్లు బాగానే ఉన్నా మధ్యలో ఫ్యాన్స్ కే ఏదో అయిపోతుంటుంది. రష్మిక స్టేట్ మెంట్ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. మూడు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తకు ఈ రోజు తెరపడింది.
పుష్పలో శ్రీవల్లి పాత్రపై ఐశ్వర్య రాజేష్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రష్మిక మందన్న స్పందించింది.
ఐశ్వర్య రష్మిక పాత్ర గురించి ప్రస్తావించిన తర్వాత, రష్మిక స్పందిస్తూ ఆమె ఉద్దేశ్యాన్ని తాను సరిగ్గా అర్థం చేసుకున్నానని చెప్పింది. దానికి ఐశ్వర్య ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది.
శ్రీవల్లి పాత్రలో రష్మిక కంటే తానే బాగుంటానని ఎప్పుడూ అనుకోలేదని, అలాంటి పాత్ర తనకు సూటవుతుందని మాత్రమే చెప్పానని ఆమె స్పష్టం చేసింది.
తన ప్రకటన తప్పుగా అర్థం చేసుకున్నారని, రష్మిక యాక్టింగ్ అంటే తనకు చాలా అభిమానం అని పేర్కొంది. ఆమె తన ప్రకటనలో, తెలుగు సినిమాలో నేను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నాను అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు. నాకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే చాలా ఇష్టమని, నాకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తానని బదులిచ్చాను. ఉదాహరణగా చెప్పాలంటే, పుష్పలోని శ్రీవల్లి పాత్ర నాకు చాలా నచ్చిందని, అలాంటి పాత్రలు నాకు సరిపోతాయని నేను చెప్పాను.
"అయితే, దురదృష్టవశాత్తు, నా వ్యాఖ్యాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో నటి రష్మిక నటనను తప్పు పట్టినట్లు భావించారు. అలాంటి ఉద్దేశం నాకు అసలు లేదని పేర్కొంది. ఐశ్వర్య వ్యాఖ్యలపై రష్మిక స్పందించింది. మీ భావం నాకు అర్థం అయింది. మీరు ఇలాంటివి పట్టించుకోవద్దు.. మీ పట్ల నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు. మీ చిత్రం ఫర్హానా రిలీజ్ అవనుంది కదా ఆల్ ద బెస్ట్ అని వివాదాన్ని క్లోజ్ చేసింది రష్మిక.
తమిళ చిత్రం ఫర్హానాలో ఐశ్వర్య ప్రధాన పాత్రను పోషిస్తుంది. కుటుంబం అవసరాలు తీర్చడానికి కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేయవలసి వచ్చిన ఆమె సొంత కధే చిత్రంలో ఉంది. ఈ చిత్రంలో జితన్ రమేష్, ఐశ్వర్యదత్తా, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com