Rashmika Mandanna : రష్మిక చేతికి క్రేజీ ప్రాజెక్ట్.. అలియా ప్లేస్‌లో

Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక టైమ్ బాగా నడుస్తోంది.. పట్టిందల్లా బంగారం లాగా మారిపోతుంది. గతేడాది పుష్ప మూవీతో గ్రాండ్ హిట్ కొట్టిన ఈ ఛలో అమ్మడుకి ఇప్పుడు క్రేజీ ఆఫర్ దక్కినట్టుగా తెలుస్తోంది.
జనతా గ్యారేజ్ మూవీ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే... నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్‌ని తీసుకున్నారు.
కానీ రీసెంట్‌గా ఆమెకి పెళ్లి అవ్వడంతో షూటింగ్ లకి కాస్త బ్రేక్ ఇచ్చింది. దీనితో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆమె ప్లేస్‌లో రష్మిక ని ఫైనల్ చేసినట్టుగా సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.
అనిరుధ్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com