సినిమా

Rashmika Mandanna : అది విని చాలా బాధేసింది.. రష్మిక ఆవేదన

Rashmika Mandanna : ఈవెంట్ కు హాజరైన అందరికీ ధన్యవాదాలు. మీలో కొందరు గాయపడ్డారని విన్నాను. చాలా బాధేసింది. మీరంతా బాగున్నారని, కేర్ తీసుకుంటున్నారని భావిస్తున్నాను.

Rashmika Mandanna : అది విని చాలా బాధేసింది.. రష్మిక ఆవేదన
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (ఆదివారం) సాయంత్రం యూసఫ్‌ గూడలో జరిగింది. ఈ ఈవెంట్ కి బన్నీ అభిమానులు వేల సంఖ్యలో పోటెత్తారు. దీనితో అక్కడ తొక్కిసలాట జరిగింది. దీనితో పలువురు అభిమానులు గాయపడ్డారు. అయితే ఈ ఘటన పైన హీరోయిన్ రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.

ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. 'ఈవెంట్ కు హాజరైన అందరికీ ధన్యవాదాలు. మీలో కొందరు గాయపడ్డారని విన్నాను. చాలా బాధేసింది. మీరంతా బాగున్నారని, కేర్ తీసుకుంటున్నారని భావిస్తున్నా' అనిరాసుకొచ్చింది. కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17న రిలీజ్ కానుంది. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.


Next Story

RELATED STORIES