Rashmika Mandanna: 'తనకు దిష్టి తీస్తా'.. ఆ స్టార్ హీరోపై ఇష్టాన్ని బయటపెట్టిన రష్మిక..

Rashmika Mandanna (tv5news.in)
Rashmika Mandanna: రష్మిక మందనా.. కన్నడ నుండి వచ్చి తెలుగులో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న నటి. ప్రస్తుతం ఈ భామ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను ఖాతాలో వేసుకుంటూ ఇతర స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనే ఇస్తోంది. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లకే స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రష్మిక రేంజ్ ఇప్పుడు మరింత పెరిగిపోయింది. తాజాగా విజయ్‌తో కలిసి ఓ పాన్ ఇండియా చేస్తున్న రష్మిక చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
తమిళ హీరో విజయ్ ఎన్నో ఏళ్లుగా కష్టపడి స్టార్ హీరో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక త్వరలోనే బీస్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. బీస్ట్ షూటింగ్ సమయంలోనే తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ సినిమాను సైన్ చేశాడు విజయ్. ఇన్నేళ్ల తర్వాత విజయ్ చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. తమిళ డబ్ సినిమాలతో విజయ్‌పై ప్రేమ పెంచుకున్న అభిమానులు త్వరలోనే తనను స్ట్రెయిట్ తెలుగు సినిమాలో చూడనున్నారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందనాను ఎంపిక చేసింది మూవీ టీమ్. అయితే విజయ్‌లాంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వచ్చినందుకు రష్మిక చాలా సంతోషంగా ఫీల్ అవుతోంది. తన సంతోషాన్నంతా ఒక ట్వీట్‌తో బయటపెట్టింది ఈ కన్నడ బ్యూటీ.
'ఈ ఫీలింగ్ ఒక రేంజ్‌లో ఉంది. ఆయన ఎన్నో సంవత్సరాలుగా తెరపై చూసిన నేను.. ఇప్పుడు ఆయనతో కలిసి ఏదైనా చేయగలను. తనతో డ్యాన్స్ చేయగలను, నటించగలను, దిష్టి తీయగలను, మాట్లాడగలను, ఫైనల్‌గా ఏదైనా చేయగలను.' అంటూ చాలా సంతోషంతో సినిమా పూజా కార్యక్రమంలోని ఫోటోలను ట్వీ్ట్ చేసింది రష్మిక.
Ok now this feels like something else… ❤️❤️ Been watching sir for years and years and now to do everything that I've been wanting to do.. act with him, dance with him, take his nazar, talk to him.. everything .. yaaaaay finally! 😄❤️ An absolute delight.. ❤️#talapathyvijay pic.twitter.com/SHtFfKryip
— Rashmika Mandanna (@iamRashmika) April 7, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com