Rashmika Mandanna: 'ప్రేమ అంటే రెండు వైపులా ఉండాలి'.. రిలేషన్‌షిప్‌పై రష్మిక కామెంట్స్..

Rashmika Mandanna (tv5news.in)
Rashmika Mandanna: 'పుష్ప' సినిమా సక్సెస్‌తో ఫుల్ ఫార్మ్‌లో ఉంది రష్మిక మందనా. ఈ సినిమా, ఇందులోని తన శ్రీవల్లి పాత్ర చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే టాలీవుడ్‌లోని బిజీ హీరోయిన్లలో తాను కూడా ఒకటి అయిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న రష్మిక.. బాలీవుడ్‌లో తన సత్తా చాటాలనుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. తన పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను పంచుకుంది.
ఇప్పటికే టాలీవుడ్‌లోని కొందరు స్టార్ హీరోలతో జోడీ కట్టేసింది రష్మిక. మరికొందరు స్టార్లతో నటించడానికి సిద్ధమవుతోంది. అంతే కాకుండా బాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమవుతోంది. అందులో ఒకటి సిద్ధా్ర్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న 'మిషన్ మజ్ను' కాగా మరొకటి అమితాబ్ బచ్చన్‌తో చేస్తున్న 'థాంక్యూ'.
రష్మిక మందనా, విజయ్ దేవరకొండ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అయితే వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారన్న రూమర్స్ కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ వీరిద్దరు మాత్రం తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని ఈ రూమర్స్‌ను కొట్టిపారేస్తున్నారు. అయితే ఇటీవల ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది రష్మిక మందనా.
తన దృష్టిలో ప్రేమ అంటే ఒకరికొకరు టైమ్‌ను, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడమే కాకుండా ఒకరి దగ్గర ఒకరు సేఫ్‌గా ఫీల్ అవ్వడం అని చెప్పింది రష్మిక. ప్రేమ అనే భావాన్ని మాటల్లో చెప్పడం కష్టమని, అది కేవలం ఫీలింగ్స్‌కు సంబంధించింది అని తెలిపింది. ప్రేమ అనేది రెండు వైపులా ఉంటేనే రిలేషన్‌షిప్ ముందుకెళ్తుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక తనను పెళ్లి గురించి అడిగితే.. దానికి ఇంకా చాలా టైమ్ ఉందని ప్రస్తుతం తాను ఇంకా చిన్నపిల్లే అంటోంది రష్మిక మందనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com