'డియర్ కామ్రేడ్' కి నాలుగేళ్లు.. విజయ్ దేవరకొండతో రష్మిక సెల్ఫీ..

డియర్ కామ్రేడ్ కి నాలుగేళ్లు.. విజయ్ దేవరకొండతో రష్మిక సెల్ఫీ..
గీతగోవిందం ఇద్దరూ కలిసి పని చేసిన మొదటి సినిమా.. ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది..ప్రేక్షకులకు తెగ నచ్చేసింది ఈ జంట.

గీతగోవిందం ఇద్దరూ కలిసి పని చేసిన మొదటి సినిమా.. ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది..ప్రేక్షకులకు తెగ నచ్చేసింది ఈ జంట. ఇద్దరూ కలిసి నటించిన రెండో సినిమా డియర్ కామ్రేడ్.. ఆ సినిమా వచ్చే అప్పుడే నాలుగేళ్లయిపోయింది... ఆ సినిమా నాకెంతో స్పెషల్ అంటూ రష్మిక డియర్ కామ్రేడ్ విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన భరత్ కమ్మ, నటుడు విజయ్ దేవరకొండతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేసింది.

గతంలో చాలా సందర్భాలలో, విజయ్, రష్మిక 'డియర్ కామ్రేడ్' తమకు ఎప్పుడూ ప్రత్యేకమని చెప్పారు. 'డియర్ కామ్రేడ్' విడుదలై నాలుగేళ్లు పూర్తవుతుండగా, చాలా మంది ఆ సినిమాని, దాని థీమ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సినిమాకు పని చేసిని టీమ్ ని ప్రశంసించింది. "నాకు ఎప్పుడూ చాలా ప్రత్యేకమైన చిత్రం. #4yearsofdearcomrade @bharatkamma @thedeverakonda ధన్యవాదాలు" అని రెండు హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది.

'డియర్ కామ్రేడ్' తర్వాత రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ 'స్నేహం' మరింత బలపడింది. ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్లడం, డేట్‌లకు వెళుతూ కెమెరా కంటికి చిక్కువారు. కానీ ఎప్పుడూ మేమిద్దరం మంచి స్నేహితులం అని చెబుతుంటారు. ఇద్దరి మధ్యా ఎదో ఉంది అని అనుకునే వారి ఆలోచనలకు చెక్ పెడుతుంటారు.

భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, శృతి రామచంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. వర్క్‌ప్లేస్ లో వేధింపులు మహిళల ఆశయాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ చిత్రం హైలైట్ చేస్తుంది. 'డియర్ కామ్రేడ్' థీమ్, విజువల్స్, జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతానికి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ సమీక్షలను అందుకుంది.


Tags

Next Story