Rashmika Mandanna : వీల్ ఛెయిర్ లో ఎయిర్ పోర్ట్ కు రష్మిక మందన్నా

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ గాయపడింది. అయితే ఇలాంటివి చిన్న గాయాలుగానే కనిపిస్తాయి. అందుకే చాలామంది తనకు తగిలింది కూడా చిన్నదే అనుకున్నారు. బట్ లేటెస్ట్ గా తను ఎయిర్ పోర్ట్ నుంచి వెళుతూ కనిపించింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుడికాలు చీలమండకు పెద్ద గాయమే అయినట్టుంది. తను కనీసం నడవలేకపోతోంది. కాలుకు కట్టు కట్టుకుని వీల్ ఛెయిర్ నుంచి కార్ వరకూ వెళ్లింది. కార్లో కూర్చోవడానికి కూడా ఎడమ కాలితో నడుస్తూ కుంటుకుంటూ వెళ్లి కార్ ఎక్కింది. ఇది చూసిన చాలామంది అయ్యో పాపం రష్మిక అనుకుంటున్నారు.
ప్రస్తుతం తను ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ డేట్స్ తను సల్మాన్ ఖాన్ తో నటిస్తోన్న సికందర్ సినిమా కోసం వాడాలి. కానీ గాయం కారణంగా షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోయాయి. ఈ మూవీతో పాటు తను నటించిన ఛావా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ద గర్ల్ ఫ్రెండ్ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఇవి కాక తెలుగులో కుబేర, థామా అనే హిందీ మూవీలో నటిస్తోంది రష్మిక.
సో.. జిమ్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే చాలా జాగ్రత్తలే తీసుకోవాలి. ఒక్కోసారి చిన్న పొరబాట్లే పెద్ద గాయాలకు దారి తీస్తాయి. రష్మిక మందన్నా త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com