Rashmika Mandanna: శ్రీవల్లీ.. మరీ ఇంత ఓవర్ అయితే ఎలా తల్లీ.. నెటిజన్స్ ట్రోల్స్

Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.. వరుస ఆఫర్లు దక్కించుకుంది. రీసెంట్‌గా వచ్చిన పుష్పలో శ్రీవల్లిగా గ్లామర్ బ్యూటీ అందరినీ అలరించింది. తారలు ఎక్కడికి వెళ్లీ కెమెరా తమని ఫాలో అవుతున్న విషయాన్ని మర్చిపోతారో లేక కావాలనే అలా చేస్తారో కానీ నెటిజన్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా బిజీగా ఉంటున్న రష్మిక తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఆమె డ్రెస్సింగ్ ఒకింత వింతగా ఉంది. లాంగ్ షర్ట్, డెనిమ్ షార్ట్ ధరించి నెటిజన్స్ ట్రోల్స్‌కి కారణమైంది.
రష్మిక మందన్న చివరిగా అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్‌లో కనిపించింది . డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.
జనవరి 23న, రష్మిక తన సహాయకుడితో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. పింక్ క్యాప్, బ్లాక్ మాస్క్ ధరించి నడిచి వస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే, నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఒకరైతే ప్యాంట్ మర్చిపోయారా అని అడిగారు, మరొకరు అది కూడా ఎందుకు వేసుకోవడం అని రాశారు. ఇదిలా ఉంటే రష్మిక మందన్న నటించనున్న పుష్ప: ది రూల్ షూటింగ్ మార్చిలో ప్రారంభమవుతుంది. ఇక రష్మిక కొత్త ప్రాజెక్టులు.. ఆడవాళ్ళు మీకు జోహార్లు, మిషన్ మజ్ను, గుడ్‌బై చిత్రాల్లో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com