Rashmika Mandanna : గాయపడ్డ రష్మిక.. ఆగిన షూటింగ్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గాయం బారిన పడింది. దీంతో తను చేస్తోన్న ప్రాజెక్ట్స్ షూటింగ్స్ అన్నిటికీ గ్యాప్ వచ్చింది. యస్.. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. రీసెంట్ గా రష్మిక మందన్నా జిమ్ చేస్తుండగా తనకు తానే స్కిడ్ అయిందట. దీంతో చిన్న చిన్న గాయాలయ్యాయట. ఆ కారణంగా తను డేట్స్ ఇచ్చి ఉన్న సల్మాన్ ఖాన్ మూవీ ‘సికందర్’షూటింగ్ కు గ్యాప్ వచ్చిందట. అయితే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత తను బెటర్ గా ఫీలవుతున్నా అని భావించాక తిరిగి సికందర్ సెట్స్ లో అడుగుపెట్టిందట. నిజానికి ఈ విషయం కూడా ఆ సెట్స్ లోనే అందరికీ తెలిసిందట. అలా న్యూస్ బయటకు వచ్చింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న సికందర్ ద్వారా రష్మిక ఫస్ట్ టైమ్ బాలీవుడ్ ఖాన్ హీరోతో నటిస్తుండటం విశేషం.
డిసెంబర్ లో విడుదలైన పుష్ప 2లోని నటనకు అద్భుతమైన అప్లాజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా నటించిన ఛావా అనే హిందీ మూవీ ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది వీటితో పాటు తెలుగులో ద గర్ల్ ఫ్రెండ్, కుబేర చిత్రాలున్నాయి. హిందీలో సికందర్ కాక థామా అనే హారర్ మూవీలో నటిస్తోంది. మొత్తంగా చిన్న గాయానికే పెద్ద రచ్చ చేస్తోన్న సినీ సెలబ్రిటీస్ ఉన్న టైమ్ లో తను కామ్ గా రెస్ట్ తీసుకుని మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టడం అంటే రష్మిక డెడికేషన్ ఎలాంటిదో తెలియజేస్తోందీ ఘటన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com