తమిళ స్టార్ హీరోతో జత కట్టనున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా

తమిళ స్టార్ హీరోతో జత కట్టనున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఫిక్స్

ప్రముఖ ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషలలో విడుదలైన 'సార్(SIR)' తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నాడు. ధనుష్, ఇదే సమయంలో, తన రెండవ తెలుగు చిత్రం కోసం శేఖర్ కమ్ములతో కలిసి పని చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా తెలుగు చిత్రసీమలో ఇప్పటికే కొన్ని అత్యుత్తమ చిత్రాలను అందించారు.

ధనుష్ ప్రస్తుతం అనేక సినిమా ప్రాజెక్ట్‌లతో మ్యాజిక్ చేస్తున్నాడు. అందులో భాగంగానే దర్శకుడు శేఖర్ కమ్ములతో భారీ బడ్జెట్ తో మూవీతో రానున్నట్టు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఈ సినిమాపై అదే లెవల్లో అంచనాలు కూడా అప్పుడే పెట్టుకున్నట్టు సమాచారం. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా తమిళ, తెలుగు మూవీ.. ఇప్పుడు ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్కంఠను రేపుతోంది. శేఖర్ కమ్ముల ఈ స్క్రిప్ట్‌పై చాలా కాలంగా పని చేస్తున్నారు. ధనుష్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో నటించే నటీనటులు, సిబ్బందిపై అధికారిక ప్రకటన పెండింగ్‌లో ఉండగా, ఈ ప్రాజెక్ట్‌లో చేరడానికి రష్మిక మందన్న, నాగార్జునలను కూడా పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌లో ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే, అధికారిక నిర్ధారణ వచ్చే వరకు అతని పాత్ర గురించిన నిర్దిష్ట వివరాలు గోప్యంగా ఉంచనున్నట్టు తెలుస్తోంది.

ఈ వార్తలు గనక నిజమైతే, ధనుష్‌తో కలిసి రష్మిక, నాగార్జునల డైనమిక్ ద్వయం స్క్రీన్‌ను పంచుకోవడం సౌత్ ప్రేక్షకులకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు తొలిసారి ధనుష్, రష్మిక మందన్నలు జతకడుతుండడంతో.. ఇది సినిమా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఇదిలా ఉండగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ రాబోయే చిత్రం 'కెప్టెన్ మిల్లర్' ఇప్పటికే విపరీతమైన బజ్‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక అరుల్ మోహన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా రానున్నట్టు సమాచారం. ధనుష్ తన వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లతో ఆశ్చర్యపరుస్తూ, బహుళ భాషల్లో తనదైన ముద్ర వేస్తూ, తన బహుముఖ ప్రదర్శనలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story