Rashmika Mandanna : మరో బాలీవుడ్ మూవీలో రష్మిక మందన్నా

Rashmika Mandanna :  మరో బాలీవుడ్ మూవీలో రష్మిక మందన్నా
X

వరుస సినిమాలతో టాప్ లేపుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అకౌంట్ లో మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ పడింది. ఇప్పటికే తెలుగు, తమిళ్, హిందీ మూవీస్ అంటూ క్షణం తీరిక లేకుండా దూసుకుపోతోన్న ఈ శ్రీ వల్లి నార్త్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. తను ఫీమేల్ లీడ్ లో నటించిన ఛావా అనే హిందీ మూవీ ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకుంది రష్మిక. చాలా తక్కువ టైమ్ లో ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా అంటోంది. శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ కథగా రాబోతోన్న ఈ మూవీలో విక్కీ కౌశల్ మెయిన్ లీడ్ చేస్తున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ సరసన సికందర్ అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో పాటు థామా అనే హారర్ మూవీలో కూడా నటిస్తోంది. ఈ మూడు ప్రాజెక్ట్స్ తో తను బాలీవుడ్ లో కూడా స్ట్రాంగ్ గా పాగా వేయాలని చూస్తోంది.

ఇటు తెలుగులో కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ మూవీస్ ఉన్నాయి. కౌంటింగ్ పరంగా చూస్తే మొత్తం ఆరు సినిమాలున్నాయిప్పుడు. ఇవి కాక తాజాగా మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షాహిద్ కపూర్ సరసన ‘కాక్ టెయిల్ 2’ అనే ఈ మూవీలో రష్మికతో పాటు స్త్రీ 2తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన శ్రద్ధా కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. సో.. ఉన్న సినిమాలన్నీ దేనికవే భిన్నమైనవి కావడం చూస్తోంటే రష్మిక స్క్రిప్ట్ సెలెక్షన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల కాబోతోన్న ద గర్ల్ ఫ్రెండ్ టీజర్ కు గొప్ప రెస్పాన్స్ వచ్చింది. అందులో తనే మెయిన్ లీడ్ చేస్తోంది. మొత్తంగా గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉందీ బ్యూటీ.

Tags

Next Story