Rashmika Mandanna : మరో ఎపిక్ రోల్ తో రాబోతోన్న రష్మిక మందన్నా

Rashmika Mandanna :  మరో ఎపిక్ రోల్ తో రాబోతోన్న రష్మిక మందన్నా
X

అందం, టాలెంట్ రెండూ పుష్కలంగా ఉన్న బ్యూటీ రష్మిక మందన్నా. పాత్రను బట్టి ఎంత గ్లామర్ కురిపించడానికైనా వెనకాడదు. అలాగే.. క్యారెక్టర్ ఎలాంటిదైనా ఛాలెంజింగ్ గా తీసుకోవడంలోనూ తగ్గేదే లేదు అనగలదు. అందుకే అమ్మడు అతి తక్కువ టైమ్ లోనే నేషనల్ క్రష్ అనిపించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో టాప్ లేపుతోన్న ఈ బ్యూటీ రీసెంట్ గా పుష్ప 2లో చూపించిన నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అమలిన శృంగారం అనేలా కొన్ని బోల్డ్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ స్ట్రాంగ్ లైనప్ ఉంది తనకు. ఇందులో భాగంగా గత డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఛావా మూవీని ఈ ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ హీరోగా నటించాడు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథగా రూపొందిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఊటేకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఛావా నుంచి రష్మిక మందన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో తను మహారాణి ఏసుబాయి పాత్రలో కనిపించబోతోందని చెప్పారు. ట్రెడిషనల్ లుక్ లో అప్పటి కాలంలోని మహారాణులు ఎలా ఉంటాచో అచ్చంగా అలా కనిపిస్తోంది రష్మిక. తన లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నెటిజన్స్ అంతా రష్మికను తెగ పొగిడేస్తున్నారు.

ఇక దీంతో పాటు సల్మాన్ ఖాన్ సరసన సికందర్, అలాగే థామా అనే మరో హిందీ సినిమాలో నటిస్తోంది రష్మిక. తెలుగులో కుబేర, ద గర్ల్ ఫ్రెండ్ మూవీస్ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు రష్మిక మందన్నా హవా కొనసాగుతోందనే చెప్పాలి.

Tags

Next Story