అసిస్టెంట్ మ్యానేజర్ పెళ్లికి హాజరైన రష్మిక

అసిస్టెంట్ మ్యానేజర్ పెళ్లికి హాజరైన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక తన అసిస్టెంట్ మ్యానేజర్ పెళ్లికి హాజరైంది.

నేషనల్ క్రష్ రష్మిక తన అసిస్టెంట్ మ్యానేజర్ పెళ్లికి హాజరైంది.పెళ్లి అనంతరం వధూవరులిద్దరూ రష్మిక కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పెళ్లికి హడావిడిగా ఏం లేకుండా సింపుల్ గా చీరలో చూడముచ్చటగా ఉండి పలువురిని ఆకట్టుకుంది. పెళ్లికి వచ్చిన వారంతా రష్మికను చూసి సంతోషం వ్యక్తం చేశారు.

హిందీ చిత్రం 'మిషన్ మజ్ను'లో చివరిసారిగా కనిపించిన రష్మిక ఇటు సౌత్, అటు నార్త్ సినిమాలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ వరుస ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. రష్మిక తదుపరి బాలీవుడ్ చిత్రం 'యానిమల్'లో రణబీర్ కపూర్‌తో కలిసి కనిపించనుంది. సౌత్ విషయానికి వస్తే ధనుష్ తో కలిసి నటించేందు ఛాన్స్ కొట్టేసింది రష్మిక. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Tags

Read MoreRead Less
Next Story