Rashmika: రష్మిక మొబైల్ లాక్కున్న అభిమాని

Rashmika: రష్మిక మొబైల్ లాక్కున్న అభిమాని

కన్నడ తార రష్మిక మందన పుష్ప తో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుంది. తాజాగా పుష్ప 2 లో నటిస్తోంది. ఆవిడ ఎక్కడికెల్లినా అభిమానులు ఫొటోల కోసం గుమిగూడుతున్నారు. ప్రత్తుతం ఆవిడ క్రేజ్ మామూలుగా లేదు. జూలై 10న రష్మిక మందన కమర్షియల్ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లారు. అభిమానుల కోరిక మేరకు కారవాన్ వెలుపల ఫొటోలకు పోజులిచ్చారు. నల్ల కుర్తా, ప్రింటెడ్ దుపట్టా ధరించి కనిపించారు. అభిమానులు ఒక్కొక్కరిగా ఫొటోలు దిగుతుండగా ఆవిడ ఓ అభిమాని ఫోన్ ను పట్టుకుని ఫొటో తీయమని సూచించింది. అంతలోనే పక్కకే ఉన్న వ్యక్తి ఆవిడ చేతిలోంచి ఫోన్ ను లాక్కున్నాడు. స్వల్ప కాలంలోనే షాక్ కు గురైన రష్మిక.. తేరుకుని ఫొటోకు పోజ్ ఇచ్చింది.

సందీప్ వంగా దర్శకత్వంలో రష్మిక యానిమల్ సినిమాలో నటించింది. ఇందులో రణబీర్ రష్మికలు ప్రధానపాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 1, 2023న థియేటర్లలో రిలీజ్ కానుంది. అదే సమయంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 రిలీజ్ కు రెడీ కానుంది. ఇది 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అల్లూ అర్జున్ తో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకుంది.

తెలుగులో రెయిన్ బో అనే సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ సినిమాకు దర్శకుడిగా శాంతరూబన్ పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను సమంత చేయాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.


Tags

Next Story