Rashmika Mandanna : ఫిక్స్..రామ్‌తో రష్మిక.. !

Rashmika Mandanna : టాలీవుడ్‌లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు.. ఛలో సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ... అనతి కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది. గతేడాది అల్లు అర్జున్ పుష్ప మూవీతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తోంది.
రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబోలో ఓ మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీలో రష్మికని ఫైనల్ చేశారట బోయపాటి.. ఇప్పటికే ఆమెతో కథాచర్చలు జరపగా, ఆమె కూడా మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడనుంది. కాగా ఇది బోయపాటికి పదో సినిమా కాగా, రామ్‌కి 20వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తుండగా తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
గతేడాది బాలయ్యతో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి.. ఇప్పుడు యంగ్ హీరో రామ్‌తో సినిమా చేస్తుండడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇందులో మీరాజాస్మిన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా సమాచారం. కాగా రామ్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్‌లో వారియర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత రామ్, బోయపాటి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com