Sukumar : శ్రీవల్లిని వదలనంటోన్న సుకుమార్

Sukumar  :  శ్రీవల్లిని వదలనంటోన్న సుకుమార్
X

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో హీరోయిన్లకు బలమైన ప్రాధాన్యం ఉంటుంది. అలాగే గ్లామరస్ గానూ కనిపిస్తారు. ఆ క్యారెక్టర్స్ కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని చాలామంది హీరోయిన్లు అనుకుంటారు. అయితే సుకుమార్ మాత్రం శ్రీవల్లిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు.అందుకే మరోసారి ఆ బ్యూటీనే తన సినిమాలో తీసుకోవాలనుకుంటున్నాడు.

పుష్ప 2 తో ప్యాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సుకుమార్. ఈ మూవీతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ ౩లో నిలిచాడు. అతని నెక్ట్స్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ తో ఉండబోతోంది. రంగస్థలం తర్వాత సెట్ అయిన కాంబినేషన్.. ఇప్పుడు ఇద్దరికీ ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉంది. కాబట్టి ఈ కాంబోలో వచ్చే మూవీపై భారీ అంచనాలుంటాయి.వాటిని మ్యాచ్ చేయాలంటే స్టార్ కాస్ట్ కూడా అలాగే ఉండాలి. అందుకే లక్కీ ఛార్మ్ అయిన రష్మిక మందన్నానే మరోసారి తీసుకోబోతున్నాడట సుకుమార్.

రామ్ చరణ్, రష్మిక కాంబోలో ఇప్పటి వరకూ సినిమా రాలేదు. కాబట్టి వీరి పెయిర్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. రష్మిక కూడా రంగస్థలంలో సమంతలాగా అందాలారబోయగలదు.. నటించనూ గలదు. అందుకే మరోసారి రష్మికనే రిపీట్ చేస్తూ రామ్ చరణ్ కు జోడీగా సెలెక్ట్ చేసుకున్నాడు సుకుమార్ అంటున్నారు.

Tags

Next Story