Rashmika Mandanna: మరోసారి నోరు జారిన రష్మిక.. ట్రోల్స్ మామూలుగా లేవుగా..

Rashmika Mandanna: మరోసారి నోరు జారిన రష్మిక.. ట్రోల్స్ మామూలుగా లేవుగా..
Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత, ఆమె బాలీవుడ్‌లో కూడా వరుస ఆఫర్లను అందుకుంటోంది. అయితే ఆమెకు అక్కడ ఒక్క హిట్ కూడా లేదు. అయినా ఎందుకో బాలీవుడ్‌ని ఆకాశానికి ఎత్తేస్తోంది. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందాన సౌత్ నుంచి నార్త్‌కి వెళ్లి సౌత్‌ని విమర్శిస్తోన్న ఈ సౌందర్య రాశి మరోసారి ట్రోల్స్ బారిన పడింది.


రష్మిక, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన తన కొత్త చిత్రం మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా రష్మిక మాట్లాడుతూ అనవసరంగా సౌత్ ఇండస్ట్రీపై నోరు జారింది.

"బాలీవుడ్‌లో రొమాంటిక్ పాటలు బావుంటాయి. దక్షిణాదిలో మాస్ మసాలా సాంగ్స్, ఐటెమ్ సాంగ్సే ఎక్కువగా ఉంటాయి" అని రష్మిక అంటూ, "మిషన్ మజ్ను" చిత్రంలోని రొమాంటిక్ పాటను ప్రశంసించారు. విషయం ఏమిటంటే, రష్మిక ఇప్పటివరకు టాలీవుడ్‌లో తన కెరీర్‌లో రొమాంటిక్ సాంగ్స్, మాస్ సాంగ్స్ రెండింటిలోనూ భాగం, అయినా ఆమె ఇలా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని కించపరిచడం ఇండస్ట్రీకి మింగుడు పడని విషయం.

సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోపై నటి హార్డ్‌కోర్ అభిమానులు కొందరు ఆమెను సమర్థిస్తుండగా, మరికొందరు కన్నడ ప్రేక్షకులు ఈ నటిని ఎందుకు ద్వేషిస్తున్నారో ఇప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకులకు అర్థమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

కొంతమంది సినీ ప్రేమికులు ఆ వీడియోతో అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేసి, పుష్ప 2 నుండి ఆమెను తొలగించమని కోరుతున్నారు. 'ఒకరిని ప్రశంసిస్తూ, ఆమె మరొకరిని దిగజార్చుతుంది' అని మరొకరు వ్యాఖ్యానించారు. ఒకటి, రెండు బాలీవుడ్ చిత్రాలలో నటించే సరికే నటి కళ్లు నెత్తికెక్కాయని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరీ అంత గర్వం పనికి రాదు మనం ఎక్కడ నుంచి వచ్చామన్నది ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి అని రష్మికపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story