Ratan Tata Biopic: సుధ కొంగర చేతిలో మరో బయోపిక్.. రతన్ టాటాగా..

Ratan Tata Biopic: సుధ కొంగర చేతిలో మరో బయోపిక్.. రతన్ టాటాగా..
X
Ratan Tata Biopic: ఏవియేషన్‌ అగ్రగామి జిఆర్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్రపై 'సూరరై పొట్రు' బయోపిక్‌ను రూపొందించిన ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర మరో బయోపిక్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం

Ratan Tata Biopic: ఏవియేషన్‌ అగ్రగామి జిఆర్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్రపై 'సూరరై పొట్రు' బయోపిక్‌ను రూపొందించిన ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర మరో బయోపిక్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టాటా సన్స్ మరియు టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ రతన్ టాటా జీవితాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.


ప్రస్తుతం సుధ 'సూరరై పొట్రు' హిందీ వెర్షన్‌కి దర్శకత్వం వహిస్తుండగా, సూర్య స్థానంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సుధ తదుపరి సూర్య, ఎస్టీఆర్‌లతో సినిమాలు చేయనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు రతన్ టాటా బయోపిక్ విషయానికి వస్తే, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించడానికి చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.




అభిషేక్ 2007లో విడుదలైన మణిరత్నం సినిమా 'గురు'లో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ పాత్రను పోషించారు. 2023లో సెట్స్‌పైకి వెళ్లాలని సుధ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆమె చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి.

Tags

Next Story