Raveena Tandon : స్టూడియోల్లో వాంతులు శుభ్రం చేశా : రవీనా టాండన్

Raveena Tandon : ప్రస్తుతం 'కేజీఎఫ్ 2' సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న బాలీవుడ్ నటి రవీనా టండన్ తన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టినప్పటికీ అసలు సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే లేదని వెల్లడించింది.
నటిని కావాలని ఎప్పుడు అనుకోలేదని తెలిపింది. మొదట్లో నేను స్టూడియో ఫ్లోర్స్ తుడిచేదాన్ని. ఎవరైనా వాంతులు చేసుకుంటే నేను వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసేదానిని అని చెప్పుకొచ్చింది. ప్రహ్లాద్ కక్కర్ దగ్గర అసిస్టెంట్‌గా కూడా పని చేశానని తెలిపింది.
ఆయన దగ్గర పనిచేసినప్పుడు కొన్నిసార్లు ఎవరైనా మోడల్స్ రాని సమయంలో వెంటనే రవీనాను పిలవండి అనేవారని, అలా మేకప్ వేసుకుని కొన్ని పోజులివ్వమని చెప్పేవారని తెలిపింది. అలా అక్కడి నుంచి మోడలింగ్, ఆ తర్వాత సినిమా ఆఫర్లు వచ్చాయని తెలిపింది.
సినిమాల్లోకి రాకముందు ఏం తెలియదని, వచ్చాకే అన్ని తెలుసుకున్నానని పేర్కొంది. కాగా రవీనా టండన్ 1991లో పత్తర్ కే ఫూల్ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలతో ఆకట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com