Raveena Tandon : రవీనా టాండన్ ఇంట విషాదం..!
By - TV5 Digital Team |11 Feb 2022 2:45 PM GMT
Raveena Tandon : బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంట విషాదం నెలకొంది .. ఆమె తండ్రి, సినీ దర్శకుడు రవి టాండన్ కన్నుమూశారు.
Raveena Tandon : బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంట విషాదం నెలకొంది .. ఆమె తండ్రి, సినీ దర్శకుడు రవి టాండన్ కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు... గత కొద్దిరోజులుగా శ్వాసకోశ సంబంధిత వ వ్యాధులతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. దీనితో తండ్రి దహనసంస్కారలను రవీనా పూర్తి చేసింది. తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రవీనా.. "ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావ్... నన్ను నడిపిస్తావ్" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ విషయం తెలియగానే బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కాగా రవి టాండన్ ఖేల్ ఖేల్ మే, అన్హోనీ, నజరానా, మజ్బూర్, ఖుద్-దార్, జిందగీ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com