Raveena Tandon: బాడీ షేమింగ్ పై ప్రశ్న .. రవీనా ఘాటు రిప్లై

Raveena Tandon: సినిమాల్లో తారలు సన్నగా, నాజూగ్గా ఉండాలి.. వయసు మీద పడినా, పెళ్లై పిల్లలు పుట్టినా.. లేకపోతే అభ్యంతరం వ్యక్తం చేస్తారు అభిమానులు.. కొంచెం లావుగా కనిపిస్తే చాలు ట్రోల్ చేస్తుంటారు.. అవి వారిని ఎంత బాధిస్తాయో అని ఒక్కసారి కూడా ఆలోచించరు.. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కూడా ఇలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు.
ఆమె తాజాగా నటించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఎంజాయ్ చేస్తూన్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ప్రసవం తర్వాత బరువు పెరగడంపై విమర్శలు ఎదుర్కొన్న సంఘటనను గుర్తుచేసుకున్నారు.
ఇంటర్వ్యూలో ఒకరు తన బరువు గురించి ప్రశ్నించారు.. ఆ సమయంలో నేను నా కొడుకుని ప్రసవించాను.. బిడ్డకు పాలిచ్చే సమయంలో డైట్ చేయకూడదనుకున్నాను.. అందుకే బరువు పెరిగాను. మీరు చాలా బరువు పెరిగారు. మీరు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు రియాలిటీ షోలు చేస్తున్నారు అని అన్నాడు.. దానికి నేను బరువు తగ్గవచ్చు.. మీ మొఖాన్ని ఒకసారి అద్దంలో చూస్కోండి అన్నాను అని ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు..
నాకే కాదు ఇలాంటి అవమానాలు తరచు హీరోయిన్లు ఎదుర్కొంటారు.. ఐశ్వర్యారాయ్ కూడా తన కుమార్తె పుట్టిన తరువాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైనప్పుడు లావుగా కనిపించడంతో అవమానించారు అని చెప్పుకొచ్చింది రవీనా టాండన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com