Ravi Shankar : కొడుకును హీరో డైరెక్ట్ చేస్తోన్న విలన్

హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు. విలన్ల కొడుకులూ హీరోలు అవుతున్నారు. బట్ టాలెంట్ ను బట్టే ఇక్కడ సర్వైవల్ ఉంటుంది. వారసత్వం ఎంట్రీ కార్డ్ మాత్రమే. ఆ తర్వాత టాలెంటే ముందుకు నడిపిస్తుంది. అఫ్ కోర్స్ విజయాలు కూడా కీలకం. సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో వస్తున్నాడు. నిజానికి సాయికుమార్ తండ్రి పిజె శర్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లు నటించాడు. కానీ ఎప్పుడూ బ్రేక్ రాలేదు. బట్ ఆయన తనయుల్లో సాయికుమార్ హీరోగా రాణించి తండ్రి కోరిక నిలబెట్టాడు. ఇక మిగతా ఇద్దరు కొడుకులూ డబ్బింగ్ ఆర్టిస్టుల నుంచి విలన్ల వరకూ వచ్చారు. సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ హీరోగా క్లిక్ అయినా దాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు పిజె శర్మ రెండో కొడుకు టాప్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్ విలన్ పి రవిశంకర్ తన కొడుకు అద్వైయ్ ని హీరోగా పరిచయం చేస్తూ తనే దర్శకత్వం కూడా చేయబోతుండటం విశేషం.
రవి శంకర్ 2004లోనే దుర్గి అనే కన్నడ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. బట్ ఆ తర్వాత మరే మూవీ డైరెక్ట్ చేయలేదు. విశేషం ఏంటంటే.. ఈ దుర్గి చిత్రాన్నే తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నరసింహుడు పేరుతో రీమేక్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ తనే మెగా ఫోన్ పట్టడం కాస్త ఆశ్చర్యం అనే చెప్పాలి. సుబ్రహ్మణ్యా అనే టైటిల్ తో రూపొందబోతోన్న ఈ మూవీ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అబ్బాయి మొహాన్ని చూపించలేదు కానీ.. ఏదో నిధి, గుడి, రహస్యాలకు సంబంధించిన కథలా ఉంది. మరి సాయి కుమార్ కొడుకు ఫెయిల్ అయిన చోట రవిశంకర్ కొడుకు సక్సెస్ అవుతాడేమో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com