Ravi Teja vs Nikhil: 'ధమాకా' దూకుడుకి '18 పేజెస్' ఏమవుతుందో.. ప్రేక్షకులను ఎవరు మెప్పిస్తారో..

Ravi Teja vs Nikhil: ధమాకా దూకుడుకి 18 పేజెస్ ఏమవుతుందో..  ప్రేక్షకులను ఎవరు మెప్పిస్తారో..
RaviTeja vs Nikhil: బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్ కామన్‌గా కనిపిస్తుంటుంది. అయితే ఓ టాప్ స్టార్ మరో మీడియం రేంజ్ స్టార్స్ మధ్య వార్ కూడా అప్పుడప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది.

Ravi Teja vs Nikhil: బాక్సాఫీస్ వద్ద స్టార్ వార్ కామన్‌గా కనిపిస్తుంటుంది. అయితే ఓ టాప్ స్టార్ మరో మీడియం రేంజ్ స్టార్స్ మధ్య వార్ కూడా అప్పుడప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. ఈ నెల 23న బాక్సాఫీస్ వద్ద అలాంటి ఫైట్ ఒకటి జరగబోతోంది. మాస్ మహరాజ్ రవితేజ, కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయమైన నిఖిల్ మధ్య ఈ ఫైట్ ఉండబోతోంది. రెండు సినిమాలపైనా అంచనాలున్నాయి. కంటెంట్ పరంగా వారి ఇమేజ్ లకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి. అయితే ఇద్దరూ గెలవడం అరుదు కాబట్టి.. ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అయ్యే అవకాశం ఉందో చూద్దాం.


మాస్ మహరాజ్ అంటే మినిమం గ్యారెంటీ హీరో. అయితే కొన్నాళ్లుగా ఒక్క హిట్ పడితే రెండు మూడు నాలుగు ఫ్లాపులు పడుతున్నాయి. ప్రస్తుతం ధమాకా అనే చిత్రంతో వస్తున్నాడు రవితేజ. ఈ 23న విడుదల కాబోతోన్న ఈ మూవీకి నక్కిన త్రినాథరావు దర్శకుడు. శ్రీ లీల హీరోయిన్. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నాడు రవితేజ.



ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.. అయితే ప్రమోషన్స్ ను చూసి మోసపోవడానికి జనం ఇప్పుడు ఒకప్పుడులా లేరు. ఇంకా చెబితే.. విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయి అనే ఇండస్ట్రీ సామెత ఇప్పుడు ప్రేక్షకులందరికీ బాగా తెలుసు. అయినా ధమాకా విషయంలో అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే మొదటి ఆటకే సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకుంటే సరిపోతుంది.


ఇక కెరీర్ ఆరంభంలో రవితేజను ఇమిటేట్ చేస్తున్నాడు విమర్శలు ఎదుర్కొన్నాడు నిఖిల్. మూడు నాలుగు సినిమాల తర్వాత మారాడు. తనకంటూ ఓ స్పెషాలిటీ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు అలాంటి రవితేజను ఢీ కొడుతూ 18పేజెస్ మూవీతో వస్తున్నాడు. నిఖిల్ చివరి సినిమా కార్తికేయ2 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనూహ్యాంగా ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసింది. దీంతో ఈ 23న వస్తోన్న 18పేజెస్ పై అంచనాలున్నాయి.



వీటిని అందుకోవడం కోసమే.. రెండు నెలల క్రితమే రావాల్సిన చిత్రంలో కొన్ని మార్పులు చేసి కాస్త ఆలస్యంగా వస్తున్నారు. ఇక కార్తికేయ2లో నటించిన అనుపమా పరమేశ్వరనే ఈ చిత్రంలోనూ హీరోయిన్ కావడం ఓ ప్లస్ పాయింట్. గీతా ఆర్ట్స్2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కుమారి 21ఎఫ్‌ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకుడు. ఇప్పటికే వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.



అయితే రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా కేవలం అల్లు అర్జున్, పుష్ప మూవీ భజనలా కనిపించడం ఈ మూవీకి మైనస్ అయిందనే చెప్పాలి. అయినా అంచనాలు ఉన్నాయి కాబట్టి అందుకునే అవకాశాలూ ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలకు కేవలం అవతార్ 2 తప్ప మరో పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చే అంశమే. కంటెంట్ బావుంటే రెండు సినిమాలనూ హిట్ చేసే పెద్ద మనసు ప్రేక్షకులకు ఉంది కాబట్టి.. ఈ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ చెబుదాం.

Tags

Read MoreRead Less
Next Story