Srikanth Vissa : రవితేజ అంతలా పొగిడిన ఈ శ్రీకాంత్ విస్సా ఎవరు?

Srikanth Vissa : టాలెంట్ ఉన్న వ్యక్తులను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటారు టాలీవుడ్ టాప్ హీరో రవితేజ.. ఇండస్ట్రీకి ఎంతోమంది దర్శకులను పరిచయం చేశారు ఈ మాస్ మహారాజా.. తాజాగా మరో టాలెంటెడ్ రైటర్ గురించి అందరికి తెలిసేలా చేశాడు. రవితేజ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఖిలాడి.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న(బుధవారం) పార్క్ హయత్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయని, అందులో ఒకటి రచయిత శ్రీకాంత్ విస్సా కాగా, మరో రీజన్ నిర్మాత అని చెప్పుకొచ్చాడు. శ్రీకాంత్ విస్సాకి మంచి భవిష్యత్తు ఉందని, అతనితో వరుసగా సినిమాలు చేస్తున్నాని చెప్పుకొచ్చాడు రవితేజ. దీనితో ఈ శ్రీకాంత్ విస్సా ఎవరని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త, వెంకీమామ, పంతం, MCA చిత్రాలకి మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రాశారు శ్రీకాంత్.
గతేడాది అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప చిత్రానికి కూడా శ్రీకాంత్ విస్సానే మాటల రచయిత కావడం విశేషం. సుకుమార్ నిర్మాణ సారధ్యంలో వస్తోన్న 18 పేజీస్, రవితేజ రావణాసుర చిత్రాలకి కూడా మాటలు అందిస్తున్నారు శ్రీకాంత్ విస్సా.. కాగా ఆయన త్వరలో మెగా ఫోన్ పట్టుకోనున్నారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com