Ravi Teja : ఆ హీరోయిన్ తో రవితేజ లిప్ టు లిప్ కిస్.. పిక్ వైరల్..!
Ravi Teja : గతేడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మంచి జోష్ మీదున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. చేతిలో అరడజన్ సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాని చేస్తున్నాడు .. ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్, కామెడీ సన్నివేశాలతో పాటుగా ఓ లిప్ టు లిప్ కిస్ సీన్ కూడా ఉండనుందట.. డింపుల్ హయతితో రవితేజ ముద్దు సీన్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా రవితేజ ఇప్పటివరకు లిప్ లాక్ సీన్ లో నటించలేదు.. ఇక ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com