Ravi Teja: కాలికి గాయం అయినా.. డ్యాన్స్ ఇరగదీసిన మాస్ మహరాజా
Ravi Teja: రవితేజకు సినిమా అంటే ప్రాణం. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడం కోసం ఎంత రిస్క్ అయినా ఫేస్ చేస్తుంటారు హీరోలు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలంతా తమ బెస్ట్ డ్యాన్స్ అని చెప్పుకున్న అన్ని సందర్భాల్లో తీవ్రమైన జ్వరమో లేక ఏదైనా గాయంతో బాధ పడుతున్న సందర్భమో అయి ఉంటుంది. ఇక ఇప్పుడు రవితేజ కూడా అదే చేశాడు.
తన లేటెస్ట్ మూవీ ధమాకా నుంచి 'దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటివే పిల్లో' అనే పాట వచ్చింది. ఈ పాట చూస్తే ఎవరికైనా డ్యాన్స్ చేయాలన్న ఊపు వస్తుంది. ఆ రేంజ్ లో కంపోజ్ చేసి పాడాడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. అయితే ఈ పాట చిత్రీకరణకు రెండు రోజుల ముందు రవితేజ మరో సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు.
క్రేన్ కు ఉండే రాడ్ గుచ్చుకుని అతని మోకాలి నుంచి కింది వరకూ చీరుకుపోయిందట. అయినా అక్కడ కూడా షూటింగ్ ఆపకుండా ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని ఫినిష్ చేశాడట. అయితే ఆ సంఘటన తర్వాత రెండు రోజులకే ఈ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. అప్పటికే అంతా ఫిక్స్ అయిపోయింది.
దీంతో రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా కాలికి కట్టు కట్టుకునే షూటింగ్ కు వెళ్లాడు. స్టార్ హీరో కాబట్టి ఏదో చిన్న స్టెప్పులతో మేనేజ్ చేయొచ్చు. కానీ ఈ పాట చూస్తే మాస్ రాజా యంగ్ బ్యూటీ శ్రీ లీల కంటే ఎక్కువ ఎనర్జీతో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. మామూలుగా శ్రీ లీల ఎనర్జీ ఓ రేంజ్ లో ఉంటుంది.
ఇటు రవితేజ వయసు రీత్యా చూసినా ఆ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ఇబ్బంది పడతారు. కానీ ఆమెతో పోటీపడి మరీ స్టెప్పులు ఇరగదీశాడు. ఈ పాటను కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్. ఇక ఇలాంటి బీట్స్ కు అతని స్టెప్పులు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com