Dhamaka Twitter Review: రవితేజ ఎనర్జీ రిపీట్.. క్లైమాక్స్‌లో అసలైన ట్విస్ట్

Dhamaka Twitter Review: రవితేజ, శ్రీలీల జంటగా నటించిన 'ధమాకా' సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. పాటలు, టీజర్లలో రవితేజ ఎనర్జీ చూసినవారంతా 'వెంకీ, దుబాయ్ శ్రీను' చిత్రాలను గుర్తుకు తెచ్చారని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఎంటర్ టైన్ మెంట్ సినిమాలను డీల్ చేయడంలో దిట్ట అయిన దర్శకుడు త్రినాథరావు, రైటర్ ప్రసన్నకుమార్ ల కాంబినేషన్ ఫుల్ మీల్స్ ఎంటర్ టైన్ మెంట్ అనే విషయం తెలిసిందే.
ధమాకా మొదటి సగం చాలా వినోదాత్మకంగా ఉందని, రవితేజ పాత్ర తన పాత చిత్రాలను గుర్తుకు తెచ్చిందని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. రవితేజ లుక్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా సినిమాకు ప్లస్సవుతుందని అంటున్నారు. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతంతో పాటు రీరికార్డింగ్‌ను మెచ్చుకున్నారు.
సెకండాఫ్‌లో ఎక్కువ కామెడీ సన్నివేశాలు ఉన్నాయని మరొక వినియోగదారు పోస్ట్ చేసారు. పాటలు, యాక్షన్ పార్ట్, క్లైమాక్స్ చాలా బాగున్నాయని స్పష్టం చేశాడు. ఓవరాల్‌గా దర్శకుడు త్రినాథరావు నుంచి మంచి కమర్షియల్ హిట్ కొట్టిందని అంటున్నారు.
డాన్ శీను తర్వాత ఈ రేంజ్ లో ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ అని అంటున్నారు. ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజా ఈ 'ధమాకా' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, రవితేజ తదుపరి ప్రాజెక్టులు టైగర్ నాగేశ్వరరావు, రావణ సినిమాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com