Ravi Teja: ఢిఫరెంట్ బయోపిక్‌తో రవితేజ.. అసలు ఎవరీ టైగర్ నాగేశ్వరరావు?

Ravi Teja (tv5news.in)
Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆచితూచి అడుగులేస్తున్నాడు. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పైగా వెంటవెంటనే సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ.. మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు. పైగా ఆ సినిమాల నుండి వెంటవెంటనే అప్డేట్స్ అందిస్తూ తన ఫ్యాన్స్‌ను హ్యాపీ కూడా చేస్తున్నాడు. తాజాగా రవితేజ అప్‌కమింగ్ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
బయోపిక్‌లు అనేవి ఈరోజుల్లో చాలా కామన్ అయిపోయాయి. మనకు తెలియని ఎందరి గురించో ఈ బయోపిక్‌ల ద్వారా తెలుసుకుంటున్నాం. పైగా ఈ బయోపిక్‌లు మినిమమ్ గ్యారంటీ సినిమాల్లాగా మారిపోయాయి. అందుకే నార్త్‌లోనే కాదు సౌత్‌లో కూడా స్టార్ హీరోలు సైతం ఈ బయోపిక్‌లపై దృష్టిపెట్టారు. తాజాగా రవితేజ కూడా వారి బాటలోనే వెళ్తున్నాడు. కానీ ఈ బయోపిక్ వాటన్నింటికంటే కొంచెం ఢిఫరెంట్.
ఇప్పటివరకు మనం రాజకీయ నాయకులు, హీరోలు, హీరోయిన్లు, శాస్త్రవేత్తలు.. ఇలా ఒక్కరేంటి.. ఎన్నో ప్రొఫెషన్స్‌లో ఉన్న ఎంతోమంది బయోపిక్స్‌ను చూశాం. ఆఖరికి వీరప్పన్ లాంటి నేరస్తుడి బయోపిక్ కూడా చూశాం. కానీ ఎప్పుడైనా ఒక స్టువర్టుపురం దొంగ బయోపిక్ చూసామా..? లేదు కదా.. మాస్ మహారాజ్ రవితేజ అలాంటి ఒక స్టువర్టుపురం దొంగ బయోపిక్‌తోనే మన ముందుకు రానున్నాడు.
వంశీ దర్శకత్వంలో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాను అనౌన్స్ చేశాడు. టైగర్ నాగేశ్వరరావు అంటే స్టువర్టుపురానికి పేరు తెచ్చిన గజదొంగ. అతడి బయోపిక్‌తోనే త్వరలో రవితేజ మన ముందుకు రానున్నాడు. వేట మొదలయ్యే ముందు వచ్చే మౌనాన్ని ఆస్వాదించండి అంటూ ఈ టైటిల్ లుక్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేసింది మూవీ టీమ్.
#TigerNageswaraRao pic.twitter.com/jWUKmM5iEq
— Ravi Teja (@RaviTeja_offl) November 3, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com