సినిమా

Ravi Teja: చిరు వదులుకున్న బయోపిక్‌లో రవితేజ.. ఇద్దరు బాలీవుడ్ భామలతో..

Ravi Teja: చిరంజీవి చేయాల్సిన ఓ బయోపిక్‌లో రవితేజ నటిస్తున్నాడు. ఇందులో తన సరసన ఇద్దరు బాలీవుడ్ భామలు అలరించనున్నారు.

Ravi Teja: చిరు వదులుకున్న బయోపిక్‌లో రవితేజ.. ఇద్దరు బాలీవుడ్ భామలతో..
X

Ravi Teja: ఒక్కొక్కసారి ఒక హీరోకు కథ నచ్చినా కూడా.. పలు కారణాల వల్ల ఆ కథను వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ సినీ పరిశ్రమలో చాలా కామన్. ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు కథ సిద్ధం చేస్తే.. మరో హీరోతో సినిమాను పట్టాలెక్కించాల్సి ఉంటుంది. తాజాగా అలా చిరంజీవి చేయాల్సిన ఓ బయోపిక్‌లో రవితేజ నటిస్తున్నాడు. అంతే కాకుండా ఇందులో మాస్ మహారాజ్ సరసన ఇద్దరు బాలీవుడ్ భామలు అలరించనున్నారు.

ఇప్పటివరకు సినీ పరిశ్రమలో ఎన్నో బయోపిక్‌లు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్‌లో ఎన్నో బయోపిక్‌లలో నటించారు. చివరిగా ఆయన నటించిన బయోపిక్ 'సైరా'కు పాజిటివ్ టాక్ లభించింది. కానీ చిరు ప్రస్తుతం వరుస రీమేక్‌లతో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో కొత్త దర్శకుడు వంశీ గజదొంగ 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్‌ కథను చిరంజీవికి వినిపించారట. చిరుకు కథ నచ్చినా కూడా.. సినిమా చేయడం కుదరకపోవడంతో ఈ కథ రవితేజ చేతిలోకి వెళ్లింది.


రవితేజ హీరోగా నటిస్తున్న 'టైగర్ నాగేశ్వర రావు' బయోపిక్‌తో ఇద్దరు బాలీవుడ్ భామలు టాలీవుడ్‌కు పరిచయం కావడం మరో విశేషం. అందులో ఒకరు స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నూపుర్‌ సనన్ కాగా మరొకరు మోడల్ గాయత్రీ భరద్వాజ్‌. తాజాగా టైగర్ నాగేశ్వర రావు షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. దీనికి చిరంజీవి ఛీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES