Ravi Teja: అసలు హీరోలే లేరంటున్న మాస్ మహారాజ్ రవితేజ..

Ravi Teja (tv5news.in)
Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ స్పీడ్‌ను ఏ హీరో అందుకోలేకపోతున్నారు. స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా కూడా విడుదల చేయడం లేదు. ఇక యంగ్ హీరోల విషయానికొస్తే.. వారిలో కూడా చాలామంది ఆచితూచి అడుగులేస్తున్నారు. కానీ మాస్ మహారాజ్ మాత్రం ఏకంగా అయిదు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అంతే కాకుండా వీలైనంత త్వరగా వాటి షూటింగ్‌లను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు కూడా. తన అప్‌కమింగ్ సినిమా అప్డేట్ వచ్చి రెండు రోజులు కాకముందే రవితేజ మరో అప్డేట్‌తో మన ముందుకు వచ్చేశాడు.
యంగ్ డైరెక్టర్లలో ఎక్కువగా కంగారు పడకుండా స్లోగా సినిమాలు చేసే దర్శకుడు సుధీర్ వర్మ. తాను తెరకెక్కించిన సినిమా హిట్ అయినా కాకపోయినా ఒక సినిమాను విడుదల చేయడానికి తాను కనీసం రెండు సంవత్సరాలు అయినా తీసుకుంటాడు. ఇప్పుడు అలాంటి యంగ్ డైరెక్టర్‌తోనే చేతులు కలపనున్నాడు రవితేజ. రవితేజ 70వ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల 'టైగర్ నాగేశ్వర్రావు' అంటూ తన అప్‌కమింగ్ సినిమా పోస్టర్‌ను విడుదల చేశాడు రవితేజ. ఆ పోస్టర్ విడుదల అయ్యి రెండు రోజులు కాకుండానే వెంటనే సుధీర్ వర్మతో చేస్తున్న సినిమా టైటిల్ లుక్‌ను విడుదల చేశాడు. 'రవానాసురా' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'అసలు హీరోలు అనేవారే ఉండరు' అనేది క్యాప్షన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న మాస్ మహారాజ్ మళ్లీ రెగ్యులర్ ట్రాక్‌లోకి రావాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com