Raviteja Injured : రవితేజకు గాయం.. సర్జరీ పూర్తి

మాస్ మహరాజ్ రవితేజ కుడిచేతికి గాయం అయింది. ప్రస్తుతం ఆయన తన కెరీర్ లో 75వ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఓ సీన్ చిత్రీకరిస్తుండగా గాయం అయిందట. అయితే చిన్న గాయమే కదా అని లైట్ తీసుకుని షూటింగ్ కంటిన్యూ చేశాడట రవితేజ. దీంతో అది కాస్త పెద్దగా మారింది. తీవ్రమైన నొప్పిగా మారింది. ఈ కారణంగా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి యశోద హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్నాడు. ఈ సర్జరీ తర్వాత నెలన్నరకు పైగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. అప్పటి వరకూ షూటింగ్ లో పాల్గొనకపోతేనే క్యూర్ అవుతుందని చెప్పారట. త్వరలోనే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గా హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అయినా రవితేజ ఫ్లాపులకు అలవాటుు పడిపోయాడు అనే చెప్పాలి. చాలాకాలంగా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అవుతున్నాయి. మరి దీనికి సరైన కారణాలేంటో అభిమానులను అడిగినా చెబుతారు. బట్ మనోడు సలహాలు తీసుకోడు కదా.. అక్కడే దెబ్బైపోతున్నాడు. ఇక ఈ 75వ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు. ఈ ప్లానింగ్ కు ఈ సర్జరీ అడ్డుపడేలానే ఉంది. ఏదేమైనా మాస్ రాజా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com