Ravi Teja : రవితేజ ‘మాస్ జాతర’

మాస్ మహరాజ్ రవితేజ కొత్త సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ అప్డేట్ ఇస్తాం అని ముందే ప్రకటించిన నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య.. ఎవరూ ఊహించని టైటిల్ ను పెట్టేశారు. మామూలుగానే రవితేజ మూవీ అంటే మాస్ జాతరలా ఉంటుందని చెబుతుంటారు కదా. అందుకే దాన్నే టైటిల్ గా ఫిక్స్ చేశారు. యస్.. ఈ మాస్ రాజా కొత్త సినిమా టైటిల్ ‘మాస్ జాతర’. మనదే ఇదంతా అనే క్యాప్షన్ కూడా పెట్టేశారు. మనదే ఇదంతా అనే మాట రవితేజ ఇడియట్ సినిమాలో హీరోయిన్ థియేటర్ కు వచ్చినప్పుడు చెబుతాడు. అది కాస్తా బూమరాంగ్ అవుతుంది. ఆ సీన్ బావుంటుంది. అందుకే డైలాగ్ చాలామందికి గుర్తుండిపోయింది. సో.. ఇంకా క్యాచీగా ఉంటుంది కదా.. అందుకే మాస్ జాతర.. మనదే ఇదంతా అన్నట్టుగానూ ఉంది కదా. అన్నట్టు ఇది రవితేజకు 75వ సినిమా కావడం విశేషం. అలాగే ధమాకా బ్యూటీ శ్రీ లీలకే మరో ఛాన్స్ ఇచ్చాడు మాస్ రాజా.
సామజవరగమన చిత్రానికి రచయితగా పనిచేసిన భాను బోగవరపుకు దర్శకుడుగా అవకాశం ఇస్తూ ఈ చిత్రం చేస్తున్నాడు రవితేజ. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫో బ్యానర్స్ నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ఈ సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ మధ్యలో షూటింగ్ లో రవితేజకు యాక్సిడెంట్ కావడంతో నెల రోజులకు పైగానే రెస్ట్ అవసరం అయింది. అందుకే షూటింగ్ లేట్ అయింది. అయినా ఫర్వలేదు అన్నట్టుగా వేసవి బరిలో నిలిపామని అనౌన్స్ చేశారు. మే 9న విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. ఆ డేట్ చాలామందికి బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. మరి రవితేజకూ బ్లాక్ బస్టర్ ఇస్తుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com