Mega 154 : మాస్ రాజా, మెగాస్టార్ కాంబినేషన్ మూవీ ''మెగా 154'' వీడియో రిలీజ్..

Mega 154 : మాస్ రాజా, మెగాస్టార్ కాంబినేషన్ మూవీ మెగా 154 వీడియో రిలీజ్..
X
Mega 154 :మాస్ మహారాజ రవితేజ, మెగాస్టార్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీకి సంబంధించిన వీడియా రిలీజ్ అయింది.

Mega 154 :మాస్ మహారాజ రవితేజ, మెగాస్టార్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీకి సంబంధించిన వీడియా రిలీజ్ అయింది. మెగా 154 పేరుతో చిత్రం షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు బాబీ దీనిని తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి తాజాగా వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.రవితేజ్ కారవాన్ వద్దకు నడుచుకుంటూ వచ్చి.. అన్నయ్య అని డోర్ కొట్టగానే.. హాయ్ బ్రదర్ అంటూ మెగాస్టార్ చేయి అందిస్తారు. ఇద్దరూ లోపలికి వెళ్లగానే మెగా మాస్ కాంబో మొదలైంది అని డైరెక్టర్ బాబీ చెబుతాడు. దీనితో వీడియో పూర్తవుతుంది.

ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించునుండగా.. దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దీన్ని నిర్మించారు. 2023 సంక్రాంతి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు.

Tags

Next Story