Khiladi Release Date: 'ఖిలాడి' రిలీజ్ డేట్‌పై ఫ్యాన్స్ అసంతృప్తి.. ఆ సెంటిమెంటే కారణం..

Khiladi Release Date: మాస్ మహారాజ్ రవితేజ.. 'క్రాక్' సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. క్రాక్‌కు ముందు రవితేజ నటించిన ఏ చిత్రం ఆశించినంత విజయాన్ని సాధించలేదు. కానీ మళ్లీ తన కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది క్రాక్. ఇప్పుడు అదే సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. కానీ ఖిలాడి విడుదల తేదీ చూస్తే.. రవితేజ ఫ్యాన్స్ కాస్త ఖంగారు పడుతున్నారు. ఎందుకంటే..?
రవితేజ అప్‌కమింగ్ సినిమా 'ఖిలాడి' ఫిబ్రవరి 11న విడుదల తేదీని ఖరారు చేసుకుంది. కానీ రవితేజ కెరీర్‌లో ఫిబ్రవరిలో వచ్చి హిట్ కొట్టిన ఒక్క సినిమా కూడా లేదు. ముందుగా 2006లో హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటించిన 'షాక్' సినిమా ఫిబ్రవరి నెలలోనే విడుదలయ్యింది. అది కమర్షియల్‌గా అంత సక్సెస్ సాధించలేకపోయింది.
2012లో 'నిప్పు', 2018లో 'టచ్ చేసి చూడు' సినిమాలు కూడా ఫిబ్రవరిలోనే విడుదలయ్యి ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య వస్తు్న్న ఖిలాడి కూడా ఫిబ్రవరిలోనే విడుదవ్వడం మాస్ మహారాజ్ ఫ్యాన్స్‌ను ఖంగారు పెడుతోంది. మరి ముందు సినిమాలలాగా సెంటిమెంట్‌తో ఖిలాడి కూడా కమర్షియల్‌గా వెనకబడుతుందో లేదా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com