RaviTeja : సంక్రాంతి టార్గెట్ గా రవితేజ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్

మాస్ మహారాజ్ రవితేజ ఈ యేడాది సంక్రాంతి టార్గెట్ గా మొదలుపెట్టిన మాస్ జాతర మూవీ మిస్ అయింది. ఈ మూవీ షూటింగ్ లో గాయపడటంతో షూటింగ్ ఆలస్యం అయింది.దీంతో ఈ చిత్రాన్ని సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. బట్ 2026 సంక్రాంతి టార్గెట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అయిందని సమాచారం. నేను శైలజతో బ్లాక్ బస్టర్ అందుకున్న కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి 'అనార్కలి' అనే టైటిల్ కూడా పెట్టారట. అనార్కలి అనే పేరు చరిత్రలో నిలిచిపోయినది. ఈ పేరుతో వచ్చిన సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. అఫ్ కోర్స్ ఆ చరిత్ర నేపథ్యంలో వచ్చిన సినిమాలే అవి. అక్బర్ తనయుడు సలీమ్ ప్రేమించిన అమ్మాయి పేరు అనార్కలి. కానీ అక్బర్ వారి ప్రేమను అంగీకరించలేదు. ఆ కథనే అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రల్లో రూపొందించారు.
ఈ కథ ఏ కాలంలో అయినా తీయొచ్చు. కానీ హిస్టారికల్ గా చెబితే సలీమ్ గా రవితేజ వయసు రీత్యా సరిపోడు. అందుకే ఆ హిస్టారికల్ టైటిల్ తో వీళ్లు సోషల్ డ్రామా చేయబోతుండవచ్చు.రవితేజ సొంత బ్యానర్ లోనే ఈ మూవీ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇక కిశోర్ తిరుమల నేను శైలజ తర్వాత ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, రెడ్, ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే మూవీ చేశాడు. కానీ ఏదీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. మరి రవితేజ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. అంతకు ముందు అసలు ఈ కాంబో ఎప్పుడు అనౌన్స్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com