Raviteja : క్రేజీ బ్యూటీస్ పై కన్నేసిన రవితేజ

ఏ ఇండస్ట్రీలో అయినా అప్పుడే షైన్ అయిన టీన్ బ్యూటీస్ అంటే మాస్ మహారాజ్ రవితేజకు చాలా ఇష్టం. అందుకే వెంటనే తన సినిమాల్లో కాస్ట్ చేస్తుంటాడు.దర్శక నిర్మాతలకూ వారినే తీసుకోమని చెబుతుంటాడు కూడా. కొన్నాళ్లుగా తన ఏజ్ లో సగం కూడా లేని బ్యూటీస్ తోనే ఎక్కువగా రొమాన్స్ చేస్తున్నాడు. ఈ విషయంలో కొన్ని విమర్శలు వచ్చినా.. బాలీవుడ్ లో ఇంతకంటే దారుణంగా ఉంటుందనే కౌంటర్స్ కూడా వస్తుంటాయి. అయినా క్రియేటివ్ ఫీల్డ్ లో ఏజ్ ను చూసేదెవరు..? శ్రీ లీల, రజీషా విజయన్, భాగ్య శ్రీ బోర్సే వంటి స్మాల్ ఏజ్ బ్యూటీస్ తో శృతి మించిన రొమాన్స్ ను కూడా పండించాడు మాస్ రాజా. తాజాగా అతని దృష్టి ఓ ఇద్దరు క్రేజీ బ్యూటీస్ పై పడిందనే టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సమ్మర్ లోనే ఈ చిత్రం విడుదల కాబోతోంది. మాస్ జాతర తర్వాత కిశోర్ తిరుమల డైరెక్షన్ లో 'అనార్కలి' అనే సినిమా చేయబోతున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే హీరో పాత్ర మంచి వినోదాన్ని పంచుతుందని టాక్. అంటే ఆవిడా మా ఆవిడే, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు తరహా కామెడీ అన్నమాట. ఆ రెండు పాత్రల కోసం లేటెస్ట్ క్రేజీ బ్యూటీస్ అయిన మమితా బైజు, కయాడు లోహర్ లను తీసుకోవాలనుకుంటున్నారని టాక్. మామూలుగా మమిత గురించి గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే అమ్మడి క్రేజ్ కు తగ్గ ఆఫర్స్ పట్టడంలో ఫెయిల్ అయింది. ఒకవేళ మాస్ రాజాతో జత కడితే భాగ్యశ్రీ లాగా సినిమా రిజల్ట్ తో పనిలేకుండా ఆఫర్స్ వస్తాయి అనుకోవచ్చు. కానీ ఆ రేంజ్ గ్లామరసం ఒలికించాలి. అది మమితతో అవుతుందా అంటే చెప్పలేం.
ఇక కయాడు గతంలోనే తెలుగులో అల్లూరి అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అప్పుడెవరూ పట్టించుకోలేదు. లేటెస్ట్ గా వచ్చిన తమిళ మూవీ డ్రాగన్ తో తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ ను ఇప్పుడు మాస్ రాజా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. అమ్మడి తీరు చూస్తే ఏ హద్దులూ లేనంత గ్లామర్ పడించేందుకు రెడీ అన్నట్టుగా ఉంది. మరి ఈ ఇద్దరు భామలతో రొమాన్స్ చేయాలనుకుంటోన్న రవితేజ కోరిక నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com