Mass Jathara : మాస్ జాతరను మర్చిపోయారా..?

Mass Jathara :  మాస్ జాతరను మర్చిపోయారా..?
X

మాస్ మహరాజ్ రవితేజ మాస్ జాతర సినిమా గుర్తుందా..? యస్.. గుర్తుందా అనే వరకూ వచ్చింది ఈ మూవీ పరిస్థితి. సమ్మర్లోనే విడుదల చేస్తాం అని చెప్పారు. కుదర్లేదు. తర్వాత రకరకాల డేట్స్ మారాయి. చివరికి ఆగస్ట్ 27 డేట్ ఫిక్స్ అన్నారు. అదీ పోయింది. ఇక కొత్త డేట్ ఏంటీ అని కూడా ఎవరూ పట్టించుకోనంతగా ఈ మూవీని వదిలేశారంతా. అందుకు కారణం.. ఆ మధ్య వచ్చిన టీజర్. చాలా అంటే చాలా రొటీన్ గా ఉందా టీజర్. ఇప్పటికే రవితేజ అంటే జనాలకు కొంత మొహం మొత్తేసింది. అందుకు కారణం ఈ తరహా రొటీన్ సినిమాలే. అయినా మాస్ రాజా మళ్లీ అదే రూట్ లోకి వెళ్లి ఈ మూవీ చేశాడు. పైగా ధమాకా తర్వాత శ్రీలీల అతనికి జోడీగా నటించింది. అప్పుడేమో కానీ ఈ టీజర్ లో చూస్తే వీరి మధ్య ఏజ్ గ్యాప్ భారీగా ‘కనిపిస్తోంది’.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన మాస్ జాతరను భాను భోగవరపు డైరెక్ట్ చేశాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఈ మూవీ కోసం చక్రి వాయిస్ ను ఏఐలో వాడి ఓ పాట చేయించారు. అదీ బాలేదు అనే టాక్ వచ్చింది.

ఇక ఈ సెప్టెంబర్ లో అయినా మాస్ జాతర వస్తుంది అనుకున్నారు. అసలు ఆ సందడే కనిపించలేదు. అక్టోబర్ లో ఇప్పటికే చాలా మూవీస్ కర్చీఫ్ వేసుకున్నాయి. అందులో మాస్ జాతర ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయా అంటే లేవు అనే చెప్పాలి. చాలామంది దీపావళికి వచ్చే అవకాశాలున్నాయి అనుకున్నారు. ఆ డేట్ కూడా ప్యాక్ అయింది. సో.. కొత్త డేట్ ఏంటీ..? ఎప్పుడు అనేది ఇప్పటికైతే ఎవరికీ తెలియదు. తెలిసినా ఈ చిత్రానికి అంత బజ్ ఉంటుందనే ఆశలు కూడా కనిపించడం లేదు.

Tags

Next Story