Mass Jathara teaser : మాస్ జాతర టీజర్.. మళ్లీ అదే రొడ్డకొట్టుడా..

మాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన సినిమా మాస్ జాతర. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ ఇది. ఏప్రిల్, మే నెలలోనే విడుదలవుతుందనుకున్నారు. ఫైనల్ గా ఈ నెల 27న రాబోతోంది.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మించిన సినిమా. ధమాకా తర్వాత రవితేజకు జోడీగా శ్రీలీల నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
టీజర్ చూస్తే ఏమంత కొత్తదనం కనిపించడం లేదు. రవితేజ మార్క్ రొటీన్ ఎంటర్టైనర్ లానే ఉంది. అదే తరహాలో రెగ్యులర్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం రవితేజ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసిన గ్లింప్స్ దీనికంటే బెటర్ గా ఉందంటే అతిశయోక్తి కాదు. రవితేజ, శ్రీలీల మధ్య ఏజ్ గ్యాప్ బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ మూవీలో పోలీస్ గా నటించాడు రవితేజ. అయితే ఈ సారి సివిల్ పోలీస్ కాదు.. రైల్వే పోలీస్ గా కనిపించబోతున్నాడని టీజర్ తో తెలుస్తోంది.
అసలు కంటెంట్ ఏంటీ అని అప్పుడే చెప్పలేం.కాకపోతే రవితేజ నుంచి మరో రొటీన్ రొడ్డకొట్టుడు సినిమానే వస్తోంది అనిపించేలా ఉంది. కొన్నాళ్లుగాఅసలు హిట్ అనే మాటే వినడం లేదు రవితేజ. ఇది ఫ్యాన్స్ నూ డిజప్పాయింట్ చేస్తోంది. ఎంచుకునే కంటెంట్స్ లోనే లోపం కనిపిస్తోంది. విశేషం ఏంటంటే.. ఈ మధ్య కాలంలో వచ్చిన రవితేజ మూవీస్ అన్నీ టీజర్స్, ట్రైలర్స్ చాలా బావున్నాయి. బట్ ఈ మాస్ జాతర టీజర్ మాత్రం వెరీ రొటీన్ గా ఉంది. సో.. ఈ కారణంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com