Raya App: అదొక డేటింగ్ యాప్.. కానీ సెలబ్రిటీలకు మాత్రమే..

Raya App: ఈ జెనరేషన్‌లో డేటింగ్ యాప్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఎవరైనా, ఏ వయసు వారైనా వాటిని ఉపయోగించవచ్చు అనే వెసులుబాటు ఉండడంతో ఈ డేటింగ్ యాప్స్‌కు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం పదుల సంఖ్యలో డేటింగ్ యాప్స్ చాలా ఫేమస్ అయ్యాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సెలబ్రిటీల కోసం కూడా ప్రత్యేకంగా డేటింగ్ యాప్ ఒకటి ఉంది.
'రాయా' అనే ఒక డేటింగ్ యాప్ పేరు ఈ మధ్య బాలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటివరకు దీనిని ఎక్కువగా ఫారిన్ సెలబ్రిటీలు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఈ మధ్య బాలీవుడ్ భామలు కూడా దీనిపై మనసు పారేసుకున్నారు. చాలా తక్కువమందికి మాత్రమే రాయా యాప్‌లోకి యాక్సెస్ ఉంటుంది. అది కూడా సెలబ్రిటీలకు మాత్రమే అన్న రూల్ అయితే తప్పనిసరి.
ఇప్పటికే జాన్వీ కపూర్, వాణి కపూర్, నేహా శర్మ, సోనాల్ చౌహాన్ లాంటి భామలతో పాటు ఇంకా ఎందరో బాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. వేరేవారి సమాచారం బయటపెట్టినా, లేదా వారితో జరిగిన సంభాషణలు గురించి బయటపెట్టినా అలాంటి వారిపై రాయా యాప్ కఠిన చర్యలు తీసుకుంటుంది. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఈ రాయా యాప్ టాపిక్ హాట్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com