ఆకాశ్‌ కేరీర్‌ డౌన్‌ కావడానికి కారణం అదే.. !

ఆకాశ్‌ కేరీర్‌ డౌన్‌ కావడానికి కారణం అదే.. !
Jai Akash: శ్రీనువైట్ల దర్శకత్వంలో​వచ్చిన ఆనందం సినిమాతో ఆకాశ్ టాలీవుడ్‎కి పరిచయం అయ్యాడు.

Jai Akash: శ్రీనువైట్ల దర్శకత్వంలో​వచ్చిన ఆనందం సినిమాతో ఆకాశ్ టాలీవుడ్‎కి పరిచయం అయ్యాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆకాశ్ పేరు టాలీవుడ్ లో మార్మోగింది. ఆనందం సినిమా తర్వాత ఆకాశ్ అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారిపోయాడు. ఆ తర్వాత చేసిన సినిమా పిలిస్తే పలుకుతా మూవీ కూడా కమర్షియల్ సక్సెస్ కొట్టింది. దీంతో ఆకాశ్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరుస ఆఫర్లు వరించినా తెలుగు చిత్రసీమలో ఆకాశ్ ఎక్కువకాలం రాణించలేదు. దానికి పలు కారణాలు కూడా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు ఆకాశ్.

1981 మార్చి 18న శ్రీలంక తమిళ కుటుంబంలో జన్మించిన ఆకాశ్. జై ఆకాశ్‌ అసలు పేరు.. సతీష్‌ నాగేశ్వరన్‌. చదువు మొత్తం కొలంబోలోనే సాగింది. పై చదువుల కోసం లండన్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. కాగా.. ఆకాశ్‌ సినిమాలపై ఆసక్తితో చెన్నై వచ్చాడు. తమిళ చిత్రాల్లో ఎంట్రీ ఇచ్చాడు. 'రోజా వనం' ఆకాశ్ తొలి చిత్రం. ఆ తర్వాత తెలుగులో సుమంత్‌ హీరో వచ్చిన 'రామ్మా చిలకమ్మ'లో ద్వితీయ హీరోగా నటించాడు. ఆనందం సినిమాతో తెలుగులో హీరోగా తెరంగేట్రం చేశాడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించాడు. స్టార్‌ స్టేటస్‌ను చూసుకుని దర్శక-నిర్మాతలను తన డిమాండ్‌లతో ఇబ్బంది పెట్టడమే అని సినీ వర్గాల అభిప్రాయం. సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూనే దర్శకుడిగా మారాడు. తమిళం, తెలుగులో పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఈ క్రమంలో తమిళ హీరోయిన్‌ నిషాను పెళ్లి చేసుకున్నాడు. అలాగే స్వయంగా దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఆనందం 2లో మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. ఆకాశ్ నిర్మాతగా చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద అంతగా ప్రభావం చూపలేదు. ఇక నిర్మాతగా తాను సంపాదించుకున్న ఆస్తులతో పాటు ఉన్న ఆస్తులను కూడా పోగొట్టుకున్నాడు. ఆర్థికంగా నష్టపోయాడు. అలాగే తన యాటిట్యూడ్‌తో మంచి అవకాశలు పొగొట్టుకున్నాడని టాక్. హీరోగా చేసిన కొన్ని సినిమాలు రిలీజ్ కి నోచుకోకపోవడంతో ఆకాశ్‌ కేరీర్‌ డౌన్‌ అయ్యింది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ తనని దారుణంగా మోసం చేసిందంటూ పలు కామెంట్స్ చేశారు. పూరి జగన్నాథ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ తనదే అంటూ ఆకాశ్‌ ఇటీవల దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ తెరపైకి వచ్చాడు. కొందరూ హీరోలు, నిర్మాతలు తన ఎదుగుదలను అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆకాశ్ కి లండన్ లో అస్తులు ఉన్నాయి.

Tags

Next Story