MAA President Manchu Vishnu: విష్ణు గెలుపులో ఆ 500 ఫోన్ కాల్స్..

manchu vishnu (tv5news.in)

manchu vishnu (tv5news.in)

MAA President Manchu Vishnu: మునుపెన్నడూ లేని విధంగా మా ఎన్నికలు ఈసారి ఉత్కంఠ రేపాయి.

MAA President Manchu Vishnu: మునుపెన్నడూ లేని విధంగా మా ఎన్నికలు ఈసారి ఉత్కంఠ రేపాయి. అటు టాలీవుడ్‌లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తిని పెంచాయి. అధ్యక్షుడయ్యేది ఎవరా? అనే ఎదురుచూపులకి తెరదించుతూ మా అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. అలా తొలి ప్రయత్నంలోనే 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు గెలుపునకు అసలు కారణాలు లేంటీ?

హోరాహోరీగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ఎలక్షన్​లో హీరో మంచు విష్ణు గెలుపు సొంతం చేసుకున్నారు. ప్రకాశ్​రాజ్​పై అద్భుత విజయం సాధించారు. రాబోయే రెండేళ్ల పాటు.. అంటే 2021-23కిగానూ విష్ణు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే విష్ణు విజయానికి కారాణాలు అనేకం. అందులో ఒకటైన లోకల్-నాన్ లోకల్' అంశం తనకు బాగా కలిసొచ్చింది. ఈ విషయమై విమర్శలు, ప్రతి విమర్శలు వచ్చినప్పటికీ.. 'మా' సభ్యులు విష్ణునే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

విష్ణుకు సినీ పెద్దల మద్దతు పూర్తి స్థాయిలో లభించింది. సూపర్​స్టార్ కృష్ణను విష్ణు కలిసి మద్దతు కోరారు. సీనియర్‌ నటులు కృష్ణంరాజు, నందమూరి బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు తదితరులు తనకు అండగా నిలిచారు. తన తండ్రి మోహన్‌ బాబు స్వయంగా రంగంలోకి దిగడం విష్ణు విజయానికి దోహదం చేసింది. పెద్దలపై తనకున్న గౌరవాన్ని పదేపదే వ్యక్తం చేయడంతో సీనియర్‌ నటుల్లో విష్ణుపై మంచి అభిప్రాయం ఏర్పడింది.

మా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌ ఇచ్చిన సలహాలు, సూచనలు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఫోల్‌ మేనేజ్‌మెంట్‌ వర్కవుట్‌ అయింది. తాను ఇవ్వాలనుకున్న హామీలను స్పష్టంగా వివరించి 'మా' సభ్యులను ఆకట్టుకోవడంలో విష్ణు సకెస్స్​అయ్యారుఅధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్​రాజ్​ను గతంలో 'మా' రెండుసార్లు నిషేధించింది. ఇది విష్ణుకు అనుకూలంగా మారింది.

ప్యానెల్ ప్రకటించినప్పుడు ప్రకాశ్​రాజ్ బలంగా కనిపించగా, ఆ తర్వాత మాత్రం ప్రతి విషయంలోనూ మంచు విష్ణు బలంగా కనిపించారు. అలానే విష్ణు, విజయంపై క్లారిటీతో ప్రత్యర్థిపై విమర్శలు చేయగా.. ప్రకాశ్​రాజ్ మాత్రం ప్రతివిమర్శలు తక్కువగా చేస్తూ, డిఫెన్స్​లో పడిపోయారు. ఇది విష్ణుకు కలిసొచ్చింది. విష్ణు తరఫు నుంచి మోహన్​బాబు పలు వీడియోలు, ఆడియో మెసేజ్​లు రిలీజ్​ చేస్తూ 'మా' సభ్యుల్లో నమ్మకాన్ని పెంచారు.

ఎన్నికల్లో గెలిస్తే తానేం చేస్తానో ప్రెస్‌మీట్‌, ఇంటర్వ్యూలోనే కాకుండా స్వయంగా ఓటర్ల ఇంటికి వెళ్లి తమ అజెండాని వివరించారు. అలా ప్రతి ఒక్కరితోనూ సహృదయంతో మాట్లాడటం ఈ విజయానికి కారణమైంది. మోహన్‌ బాబు సైతం సుమారు 500 మందితో ఫోన్‌ మాట్లాడటం విష్ణు విజయానికి కలిసొచ్చింది. విష్ణు ప్రకటించిన మేనిఫెస్టో అందరినీ ఆకర్షించింది. విష్ణుని అధ్యక్షుడ్ని చేసింది.

మా కు సొంత భవన నిర్మాణం వీటిల్లో ముఖ్యమైంది. 'మా'లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి 'మా యాప్‌', 'జాబ్‌ కమిటీ' ద్వారా అవకాశాలు కల్పించడం, అర్హులైన 'మా' సభ్యులకు ప్రభుత్వ సహకారంతో శాశ్వత నివాస గృహం, ఉచితంగా ఈఎస్‌ఐ, హెల్త్‌కార్డులు, 'మా' సభ్యుడు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, వారి పిల్లలకి కేజీ టు పీజీ వరకూ విద్యా సాయం, వృద్ధ కళాకారులకు రూ.6000 పెన్షన్‌ గణనీయంగా పెంచే ఏర్పాటు, కొత్తగా 'మా' మెంబర్‌షిప్‌ తీసుకునేవారికి రూ.75 వేలకే సభ్యత్వం తదితర అంశాలు విష్ణు విజయానికి దోహదపడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story