Reasons for divorce chaysam: పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన వెబ్ సిరీస్.?

Reasons of divorce chaysam: గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. టాలీవుడ్ కపుల్స్ అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టుగా అఫిషియల్ గా ప్రకటించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటామని సోషల్ మీడియా వేదికగా ఓకే విధంగా తెలిపారు.
ఏ మాయ చేశావే సినిమాతో మొదలైన వీరి పరిచయం... ఆ తరవాత ప్రేమగా మారి 2017, అక్టోబర్ 7న వివాహ బంధంతో ఒకటయ్యారు. మొత్తం అయిదు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి బలమైన కారణాలు ఏంటన్న మాత్రం వెల్లడించలేదు.అటు అభిమానులు మాత్రం ఎందుకు విడిపోయారు అని ఆందోళన చెందుతున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న వస్తున్న వార్తల ప్రకారం సమంత నటించిన ' ది ఫ్యామిలీ మెన్ 2 ' వెబ్ సిరీస్ ఈ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో సమంత పరిధులు దాటి ఇంటిమేట్ సీన్లలో నటించింది. అంతకుముందే సూపర్ డీలక్స్ లో బోల్డ్ గా నటించింది సమంత.. అయితే సమంత ఇలా నటించడం పట్ల అక్కినేని అభిమానులు హార్ట్ అయ్యారు.
సోషల్ మీడియా వేదికగా సమంత పైన ట్రోల్ కూడా చేశారు. అటు సమంత డ్రెస్సింగ్ విషయంలో కూడా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇవే ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణమని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు సారాంశం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com