Actress Eesha Rebba : రెబ్బా గ్లోరియస్.. ఫొటోలు వైరల్

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ' మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా. ‘అంతకు ముందు ఆ తర్వాత" సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, రాగల 24 గంటల్లో, మోస్ట్ ఎలి జబుల్ బ్యాచిలర్, ఒట్టు, మమా మశ్చీంద్ర వంటి సినిమాల్లో నటించి మెప్పించిం ది. "అ!" సినిమాలో లెస్బియన్ పాత్రలో నటనకు ప్రశంసలు అందుకుంది. అటు తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది. అయితే ఈషా రెబ్బాకు అనుకున్నంత క్రేజ్ దక్కలేదు. అందం, అభినయం అన్నీ ఉన్నా ఎందుకో ఈ ముద్దుగుమ్మకు లక్ మాత్రం కలిసి రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తన గ్లామరస్ ఫొటోషూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు అందాల ప్రదర్శన తో కుర్రకారు మతిపోగొడుతోంది. తాజాగా ఈబ్యూటీ చేసిన ఫొటో షూట్ వైరల్ గా మారింది.లవ్లీ, బ్యూటిఫుల్, గ్లోరియస్, స్టన్నింగ్అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతు న్నారు. ప్రస్తుతం ఈ భామ మలయాళ చిత్రం 'జయ జయ జయ జయహే’ తెలుగు రీమేక్ తరుణ్ భాస్కర్ తో కలిసి నటిస్తోం ది. అలాగే, 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్ సీజన్ 2 త్వరలో ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com