Bhairavam : ఓటిటిలో అదరగొడుతోన్న భైరవం

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న జీ5 ..దేశంలోని ఓటీటీ మాధ్యమాల్లో ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. దేశంలో వన్ ఆప్ ది బిగ్గెస్ట్ ఓటీటీ మాధ్యమాల్లో ఒకటైన జీ5 ఇప్పుడు భైరవం సినిమాతో ఆకట్టుకుంటోంది. మే 30న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ‘భైరవం’ మూవీ జీ5లో జూలై 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సిల్వర్ స్క్రీన్‌పై అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో భైరవం సినిమా ఆడియెన్స్‌ను అలరిస్తోంది.
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆనంది శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కీలక పాత్రల్లో మెప్పించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఓ గ్రామంలోని ముగ్గురు స్నేహితుల మధ్య నడిచే కథ. గ్రామానికి చెందిన ఆలయ భూములపై ఓ రాజకీయ నాయకుడు కన్నేస్తాడు. అతను వాటి కోసం ఏం చేశాడు. ముగ్గురి స్నేహితుల జీవితాలు ఎలా మలుపు తిరిగాయనేదే భైరవం కథ. స్నేహం, లవ్, ఎమోషన్స్ ప్రధాన అంశాలుగా తెరకెక్కిన ఈ సినిమా వంద మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించటం విశేషం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com