Kanchana Movie : కాంచన రీ రిలీజ్.. ఇదీ ఓ రికార్డే

రీ రిలీజ్ లలో ఓ రికార్డ్ గానే చూడాలి ఈ మూవీని. మామూలుగా తెలుగు స్ట్రెయిట్ మూవీస్ రీ రిలీజ్ అయితేనే అన్ని సినిమాలకూ అదే స్థాయిలో ఆదరణ రావడం లేదు. అలాంటిది ఓ తమిళ్ మూవీ. తెలుగు డబ్బింగ్ మూవీ ఇది. అలాంటి మూవీ రీ రిలీజ్ లో మొదటి రోజే ఏకంగా 3 కోట్లకు పైగా వసూళ్లు రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. అది కూడా కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే. ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ లో కూడా కేవలం తెలుగు వెర్షన్ లో రీ రిలీజ్ అయింది. మామూలుగా బుక్ మై షోలోనే ఓ క్రేజ్ ని క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ తర్వాత ఓ రేంజ్ లో ఆడియన్స్ ఎగబడ్డారు.
2011లో విడుదలైన కాంచనకు భారీ క్రేజ్ ఇప్పటికీ ఉందంటే ఆశ్చర్యమే. ముని మూవీకి సీక్వెల్ గా వచ్చిన కాంచన అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. లారెన్స్ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీలో శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించాడు. రొటీన్ మూవీలాగే వచ్చినా.. అందులోని హారర్ ఎలిమెంట్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లక్ష్మీరాయ్ హీరోయిన్ గా మూవీకి గ్లామర్ ప్లస్ గా నిలిచింది. అలాగే కోవై సరళ, దేవదర్శినిల కామెడీ అదిరిపోయింది. మరి ఇలాంటి మూవీని ఈ టైమ్ లో రీ రిలీజ్ చేయడం అంతే వింతే అనుకున్నా.. ఈ టైమ్ లో ఎలాంటి కొత్త సినిమాల సందడి లేకపోవడం కూడా ప్లస్ అయింది. అందుకే ఈ మూవీకి భారీ విజయం దక్కేలా ఉంది. ఓ రకంగా చూస్తే తెలుగులో పెద్ద స్టార్స్ నటించిన మూవీస్ రీ రిలీజ్ లాగా ఈ మూవీ కూడా ఆ స్థాయిలో మొదటి రోజు వసూళ్లు సాధించింది. ఇంకా చెబితే ఇంకొందరు స్టార్స్ కంటే కూడా చాలా ఎక్కువ మొత్తంలో వసూలు సాధించింది. వచ్చే వారం వరకూ ఎలాంటి క్రేజీ మూవీస్ లేవు కాబట్టి.. కాంచనకు మరింత పెద్ద విజయం వచ్చే అవకాశాలున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
