Devara 1 : దేవర నుంచి ఎర్ర సముద్రం సాంగ్ ట్యూన్

Devara 1 :  దేవర నుంచి ఎర్ర సముద్రం సాంగ్ ట్యూన్
X

దేవర ప్రమోషన్స్ లో జోరు కనిపిస్తోంది కానీ.. ఆ ప్రమోషన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. తాజాగా చెన్నైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ అట్టర్ ఫ్లాప్ అనేది అందరి విశ్లేషణ. ఓ సాధారణ హీరో ప్రమోషన్స్ లాగానే అక్కడ దేవర ఈవెంట్ కనిపించింది తప్ప.. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ అన్న ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ మూవీ ప్రమోషన్స్ లా కనిపించలేదు అనే టాక్ బలంగా వినిపించింది. నెక్ట్స్ బెంగళూరు, ఆపై కొచ్చిన్ నగరాల్లో ప్రమోషన్స్ ఉంటాయి. మరి ఇవైనా ఎన్టీఆర్ రేంజ్ కు తగ్గట్టుగా ఉంటాయా లేక అలా మమ అనిపించేస్తారా అనేది చూడాలి.

ఇక దేవర ప్రమోషన్స్ పరంగా ఎందుకు వీక్ అంటున్నాం అంటే.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి రెడ్ సీ(ఎర్ర సముద్రం) సాంగ్ అంటూ ఒకటి విడుదల చేశారు. బట్ ఇది సాంగ్ కాదు. జస్ట్ ట్యూన్ అంతే. సినిమాలో హై మూమెంట్స్ లో వచ్చే ఆర్ఆర్ లాంటి ట్యూన్స్ మాత్రమే. విశేషం ఏంటంటే.. ట్రైలర్ కు బిగ్గెస్ట్ మైనస్ అని ఎవరైతే ఆర్ఆర్ గురించి అనుకున్నారో ఆ ట్యూనే ఇది. అలాంటి ట్యూన్స్ తో ప్రమోషనల్ వీడియో అంటూ విడదల చేయడం మైనస్ అవుతుంది కానీ.. ప్లస్ ఎలా అవుతుందో వీరికే తెలియాలి.

Tags

Next Story