Regina Cassandra : అద్భుతమైన సన్నివేశాలతో ‘ఉత్సవం’: రెజీనా

‘నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ నాటకాలంటే ఇష్టమని... స్కూల్, కాలేజ్ డేస్‌లో వేశానని హీరోయిన్ రెజీనా కసాండ్రా అన్నారు. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా అర్జున్ సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్‌పాటిల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు, కన్నడ, హిందీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. ‘ఉత్సవం’లో కార్పోరేట్ ఎంప్లాయ్ పాత్ర చేశా. దిలీప్ ప్రకాష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. స్వతంత్ర భావాలున్న క్యారెక్టర్ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ప్రకాష్ రాజ్‌గారు, నాజర్ గారితో వర్క్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. రసూల్‌గారి అద్భుతమైన విజువల్స్, అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నా మొదటి సినిమా ‘ఎస్‌ఎంఎస్’ చేసినప్పుడే వెర్సటైల్ నటిగా ఉండాలని భావించాను. ప్రస్తుతం సన్నీ డియోల్‌గారు హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఓ హిందీ సినిమా చేస్తున్నాను’’ అన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com