Ka Release Date : 'క' రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క’. పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సందీప్, సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ‘క’ మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలింస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం అక్టోబర్ 31న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. ప్రజెంట్ కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com